Deepak Chahar: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నైకు ఎదురుదెబ్బ.. సగం మ్యాచ్​లకు దీపక్ చాహర్ దూరం..!

Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్​లో సగం మ్యాచ్​లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో చాహర్ ను సీఎస్కే రూ. 14 కోట్ల ధరకు దక్కించుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 07:04 AM IST
  • మార్చి 26న ఐపీఎల్ ప్రారంభం
  • వేలంలో చాహర్ ను రూ. 14 కోట్లకు దక్కించుకున్న సీఎస్కే
  • వెస్టిండీస్ తో సిరీస్ లో గాయపడ్డ చాహర్
Deepak Chahar: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నైకు ఎదురుదెబ్బ.. సగం మ్యాచ్​లకు దీపక్ చాహర్ దూరం..!

IPL 2022, Deepak Chahar: ఐపీఎల్ (IPL 2022) కొత్త సీజన్ ప్రారంభం కాకముందే...చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు దీపక్ చాహర్ (Deepak Chahar) ఐపీఎల్​లో సగం మ్యాచ్​లకు దూరం కానున్నాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చాహర్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఈ ఫాస్ట్ బౌలర్ శ్రీలంకతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ 15వ సీజన్ లో చాహర్ ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉంది. 

ఐపీఎల్ -2022 మెగా వేలంలో చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) రూ. 14 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఈ మెగావేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో చాహర్ రెండో వాడు. ఈ ఏఢాది ఐపీఎల్ 15వ సీజన్ మార్చి26 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని జట్లు మార్చి 14 లేదా 15 నుండి ప్రాక్టీస్ ను ప్రారంభించనున్నాయి. దీనికి కూడా ఈ సీఎస్కే ఆటగాడు అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు.

"చాహర్​ 8 వారాల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలి. అతడు ఐపీఎల్​ 2022 మొదటి దశకు అందుబాటులో ఉండడు." అని బీసీసీఐ (BCCI) అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్​లో చాహర్​ 20 టీ20లు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు. 7 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్​లోనూ సత్తా చాటిన చాహర్​.. వన్డేల్లో రెండు అర్థశతకాలు నమోదుచేశాడు. 

Also Read: Suresh Raina: సురేష్ రైనాకు ఆ అదృష్టం లభిస్తుందా, గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో స్థానం ?
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News