Godfather First Weekend box office collection: మెగాస్టార్ చిరంజీవి హీరో నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5 దసరా సందర్భంగా తెలుగు సహా హిందీ ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాను హిందీలో కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారు. అయితే ఈ కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకబడే ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో కూడా నెమ్మదిగా ఈ సినిమా ఊపందుకుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రకంగా మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో ఈ సినిమా థియేటర్ల కౌంట్ కూడా పెంచేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 600 దాకా థియేటర్లను కూడా పెంచారు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల 97 లక్షలు, రెండో రోజు ఏడు కోట్ల 73 లక్షలు, మూడవరోజు ఐదు కోట్ల 41 లక్షలు, నాలుగో రోజు 5 కోట్ల 62 లక్షలు వసూళ్లు సాధించి ఈ సినిమా నాలుగు రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల 73 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది.


ఇక ఐదో రోజు కూడా దాదాపుగా 5 నుంచి 7 కోట్ల రూపాయల దాకా వసూలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో వసూళ్లయితే బయటికి రాలేదు కానీ బాక్సాఫీస్ రిపోర్టులను బట్టి ఆ మేరకు వసూళ్లు అయితే రాబట్టినట్లుగా తెలుస్తోంది. మొదటి వీకెండ్ అయితే ఇప్పటికే పూర్తయింది. మొదటి వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 45 కోట్ల రూపాయల దాకా షేర్ లభించినట్లు చెబుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో స్టామినాకి తగిన కలెక్షన్స్ ఇవి కాదని ఒకపక్క వాదన వినిపిస్తున్నా ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఏమాత్రం వసూళ్లు అందుకోవడం కూడా గొప్ప విషయమే అని అంటున్నారు.


ఇక ఈ సినిమాను మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్ గా మోహన్ రాజ డైరెక్ట్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటించగా నయనతార మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించగా ఆమె భర్త పాత్రలో సత్యదేవ్ కనిపించారు. ఇక సునీల్, అనసూయ, దివి, సముద్రఖని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలింస్  మీద ఎన్వి ప్రసాద్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.


 


ఐదవ రోజు కలెక్షన్స్
నైజాం : 1.65 కోట్లు
సీడెడ్ : 96 లక్షలు 
ఉత్తరాంధ్ర: 86 లక్షలు 
ఈస్ట్ గోదావరి: 36 లక్షలు 
వెస్ట్ గోదావరి: 28 లక్షలు 
గుంటూరు: 44 లక్షలు 
కృష్ణ: 38 లక్షలు 
నెల్లూరు: 30 లక్షలు 
ఏపీ- తెలంగాణలో కలిపి :- 5.23 కోట్లు షేర్ (8.50 కోట్లు గ్రాస్)
 
ఐదు రోజులకు కలిపి 


నైజాం : 10.93 కోట్లు
సీడెడ్ : 8.31 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.93 కోట్లు 
ఈస్ట్ గోదావరి: 3.25 కోట్లు
వెస్ట్ గోదావరి: 1.88 కోట్లు
గుంటూరు: 3.59 కోట్లు
కృష్ణ: 2.31 కోట్లు
నెల్లూరు: 1.76 కోట్లు
ఏపీ- తెలంగాణలో కలిపి :- 36.96 కోట్లు షేర్ (61.20 కోట్లు గ్రాస్)
కర్ణాటక- 4.25 కోట్లు 
హిందీ సహా ఇండియా మొత్తం తెలుగు వర్షన్ – 4.60 కోట్లు
ఓవర్ సీస్ – 4.30 కోట్లు 
ప్రపంచవ్యాప్తంగా – 50.11 కోట్ల షేర్ (91.00 కోట్ల గ్రాస్) 


నోట్: జీ తెలుగు అందిస్తున్న ఈ సమాచారం వివిధ మాధ్యమాల నుంచి సేకరించింది. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.


Also Read: Rashmika Mandanna Sizzling Photos: మాల్దీవుల వెకేషన్లో రష్మిక మందన్న.. ఫోటోలు చూశారా?


Also Read: GodFather Collections : వంద కోట్ల పోస్టర్.. నెట్టింట్లో రామ్ చరణ్, చిరుపై ట్రోలింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook