Hanuman:`హనుమాన్` సినిమా సక్సెస్‌లో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర.. తెర వెనక ఉన్న అసలు వ్యక్తి ఇతనే..
Hanuman: హనుమాన్ సినిమా మాములుగా సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ పొంగల్ విన్నర్‌గా నిలిచి పెద్ద సినిమాలకు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చింది. హనుమాన్ బ్రాండ్ ఇమేజ్‌తో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఈ మూవీ సక్సెస్‌లో గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషించాయి. ప్రశాంత్ వర్మ తర్వాత ఈ సినిమాకు గ్రాఫిక్స్ ఎవరు అందించారనే విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Hanuman : సంక్రాంతి సినిమాల్లో ముందు నుంచి హనుమాన్ మంచి హైప్‌తో రావడమే కాదు.. అందరి అంచనాలకు తగ్గట్టే సంక్రాంతి విజేతగా నిలిచింది. అటు మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున.. నా సామిరంగ సినిమాలు పోటీలో ఉన్న అవేవి హను మాన్ ముందు నిలవలేకపోయాయి. మొత్తంగా సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఈ మూవీ సక్సెస్‌లో కథ, కథనంతో పాటు గ్రాఫిక్స్ కీ రోల్ ప్లే చేసాయి. ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి రూ. 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది.
ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి... ఈ క్రాఫ్ట్ లో "గ్రాఫిక్స్ మాంత్రికుడు"గా మన్ననలందుకునే ఉదయ్ కృష్ణ పేరు ఇపుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. అసాధారణ విజయం సాధిస్తున్న "హనుమాన్" చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొంటూ ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే "హనుమాన్" చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత దార్శనికత ప్రశాంత్ వర్మలోనూ పుష్కలంగా ఉందంటూ "హనుమాన్" రూపకర్తపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్‌పర్ట్ ఉదయ్ కృష్ణ.
తేజా సజ్జా టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్త్సైన్మెంట్ పతాకంపై ప్రవాస భారతీయ ప్రముఖుడు కె.నిరంజన్ రెడ్డి "హనుమాన్" చిత్రాన్ని నిర్మించారు. జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రీమియర్స్ నుండి విజయ దుందుభి మ్రోగిస్తోంది. టీజర్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించడతో "హనుమాన్" చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథ - కథనాలకు ఉదయ్ కృష్ణ సారధ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో "హనుమాన్" చిత్రం అత్యద్భుతంగా ప్రేక్షక ఆధరణ పొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్ లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, గెటప్ శ్రీను ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం "విజువల్ ఫీస్ట్"గా నీరాజనాలు అందుకుంటోంది.
రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన "హనుమాన్" సాధిస్తున్న సంచలన విజయం... ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెన్నికగన్న ఉదయ్ ప్రస్తుతం "బీస్ట్ బెల్స్" పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైద్రాబాద్ లోనే నెలకొలిపే సన్నాహాల్లో ఉన్నారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్ కు జీవం పోయడం ఈ చిత్రం కోసం తాను ఫేస్ చేసిన అతి పెద్ద ఛాలెంజస్ లో ముఖ్యమైనదని చెబుతున్నారు ఉదయ్. మన తెలుగు దర్శకులు కలలు గనే ఎంత గొప్ప విజువల్ అయినా... సునాయాసంగా సాకారం చేసే సామర్ధ్యం తనుకుందని సవినయంగా చెబుతున్నారు.
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook