Mothers Day Songs: మదర్స్ డే స్పెషల్ సాంగ్స్
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం. లాక్ డౌన్ వల్ల చాలా మందికి అమ్మతో గడిపే అవకాశం వచ్చింది. వారితో కలిసి Mothers Day Telugu Songs ఆస్వాదించవచ్చు.
సృష్టికి మూలం అమ్మ. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టే లేదు అంటారు. నవ మాసాలు మోసి కన్న బిడ్డను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటుంది అమ్మ. ప్రసవ వేదన నరకయాతనను తొలిసారి బిడ్డను చూసుకుని మరచిపోతుంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ.. అని తల్లికే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. తల్లిని మించిన దైవం, గురువు లేరు. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం. ఈ మదర్స్ డేని పురస్కరించుకుని కొన్ని అమ్మ పాటలు మీకోసం... అందమైన కోట్స్‌తో అమ్మకు విషెస్ తెలపండి
‘అమ్మను మించి దైవమున్నదా... ఆత్మను మించి అద్దమున్నదా..’ సాంగ్
ప్రముఖ రచయిత సి. నారాయణ రెడ్డి.. ‘అమ్మను మించి దైవమున్నదా... ఆత్మను మించి అద్దమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిది.. అందరిని కనే శక్తి అమ్మ ఒక్కటే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే’ అంటూ అమ్మ విలువను తెలిపే అద్భుతమైన పాటను అందించారు.
‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..’ నాని సినిమాలోని సూపర్ హిట్ సాంగ్
‘ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం. ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం’ అంటూ మాతృమూర్తుల కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట ఎవర్ గ్రీన్ అమ్మ పాటల్లో ఒకటిగా నిలిచింది.
‘అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా’.. రఘువరణ్ బీటెక్ సినిమాలోని పాట
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!