Harish Shankar : పట్టువదలని విక్రమార్కుడు.. అధికారులతో పనులు చేయించే వరకు వదిలిపెట్టని హరీష్ శంకర్
Harish Shankar with HMWSSB Officials హరీష్ శంకర్ తాజాగా హైద్రాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై అండ్ సీవరేట్ బోర్డ్‌తో పెట్టుకున్న వాగ్వాదం అందరికీ తెలిసిందే. రోడ్డు మీదకు మురుగు నీరు వస్తోందంటూ హరీష్ శంకర్ వేసిన ట్వీట్లను అధికారులు పట్టించుకోలేదు.
Harish Shankar with HMWSSB Officials ప్రభుత్వాలతో పని చేయించుకోవడం మన హక్కు.. ఆ హక్కును లంచంతో కొనొద్దు అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకోవడం మాత్రం మన హక్కు అనేది అందరికీ అర్థమైందే. అలాంటిది ఇప్పుడు హరీష్ శంకర్ మాత్రం అధికారులను పనులు చేసే వరకు వదిలిపెట్టలేదు. కంటిన్యూగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు.
హరీష్ శంకర్ నిన్నటి నుంచి వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్‌తో పెట్టుకున్న వాగ్వాదం అందరికీ తెలిసిందే. తన ఏరియాలో మురుగు నీరు పొంగి పొర్లుతోందని, వెంటనే పరిష్కరించండని కోరాడు. అయితే హరీష్ శంకర్ ఫిర్యాదు చేసి పన్నెండు గంటలు అవుతున్నా ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో హరీష్ శంకర్‌కు తిక్క రేగింది. దీంతో మరోసారి హరీష్ శంకర్ ట్వీట్ వేశాడు. పరిస్థితి మరీ దారుణంగా ఉందని, కంపు వాసన భరించలేకపోతోన్నామని, వెంటనే సమస్యను పరిష్కరించండని, ఎన్నిసార్లు మీకు చెప్పాలంటూ అసహనం వ్యక్తం చేశాడు.
ఆ తరువాత అధికారులు కాస్త స్పందించినట్టే చేశారు. కంప్లైంట్ తీసుకున్నామని, టోకెన్ నంబర్ రావాల్సి ఉందని ఏదేదో చెప్పారు. ఇంకా సమస్యను పరిష్కరించలేదని మళ్లీ హరీష్ శంకర్ ఫైర్ అయ్యాడు. ఇంకా మురుగు నీటి సమస్యను పరిష్కరించలేదని ఫైర్ అయ్యాడు. మీరు పని చేసే వరకు వదిలిపెట్టను అంటూ ఇలా ట్వీట్లు వేస్తూనే వచ్చాడు.
మొత్తానికి అధికారులు ఆ స్థలాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించినట్టున్నారు. సమస్యను అడ్రెస్ చేసినందుకు థాంక్స్ అంటూ అధికారులకు నమస్కారం పెట్టేశాడు హరీష్ శంకర్. మొత్తానికి అధికారులను మాత్రం నిద్రపోనివ్వలేదని అర్థమవుతోంది.
Also Read : Chiranjeevi : పెద్దరికం అనుభవించాలని లేదు!.. ఇండస్ట్రీ పెద్దపై మరోసారి చిరు కామెంట్స్
Also Read : Manchu Lakshmi Steps : బాస్ పార్టీ సాంగ్.. మంచు లక్ష్మీ స్టెప్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి