Chiranjeevi Industry pedda Position తెలుగు ఇండస్ట్రీలో దాసరి వెళ్లిపోయాక పెద్దరికం వహించే పాత్రపై భిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మెజార్టీ మాత్రం చిరంజీవియే ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని, ఆయనే ఇండస్ట్రీ పెద్ద అని నమ్ముతుంటారు. అయితే చిరంజీవి మాత్రం తాను ఎప్పుడూ కూడా ఇండస్ట్రీ పెద్దగా ఉంటానని, అలాంటి కోరిక ఒకటి తనకు ఉందని గానీ చెప్పలేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్మికుల కోసం అండగా తాను ఉంటానని చెప్పుకొచ్చాడు.
అయితే మోహన్ బాబు మాత్రం ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని ఉత్సాహపడుతున్నట్టుగా ఉంది. మా ఎన్నికలో విష్ణు గెలిచాక.. పక్కనే ఉన్న నరేష్ మాత్రం మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో నానా రచ్చ జరిగింది. అలా ఇండస్ట్రీపెద్ద విషయంలో ఎప్పుడూ వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీ పెద్దగా కాదు గానీ.. కళామతల్లికి పెద్ద కొడుకుగా సేవ చేస్తాను అంటూ చిరు చెబుతుంటాడు.
తాజాగా మరోసారి చిరు పెద్దరికం గురించి మాట్లాడాడు. చిత్రపురి కాలనీలో నూతన గృహ సముదాయాన్ని చిరంజీవి ప్రారంభించాడు. ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్ద అనే టాపిక్ మీద స్పందించాడు. సినీ పరిశ్రమలో పెద్దరికం అనుభవించాలనే కోరిక తనకు లేదని మెగాస్టార్ చిరంజీవి క్లారిటీగా చెప్పాడు. సి.కల్యాణ్, భరద్వాజ్ వంటి వాళ్లు తనను సినీ పరిశ్రమకు పెద్దోడు అంటున్నారని... కానీ వాళ్లు తనకంటే చిన్నవాళ్లు అని అనిపించుకునేందుకు ఇలా అంటున్నారని కౌంటర్లు వేశాడు.
తనకు పెద్దరికం వద్దని...సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని చిరంజీవి మరోసారి చెప్పుకొచ్చాడు. భగవంతుడు తాను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడని, అందరికీ సాయం చేసేందుకు ముందుకు వస్తాను అని అన్నాడు. ఇండస్ట్రీ పెద్దగా పెద్దరికం అనుభవించాలనే కోరిక లేదని క్లారిటీ చెప్పుకొచ్చాడు.
Also Read : Manchu Lakshmi Steps : బాస్ పార్టీ సాంగ్.. మంచు లక్ష్మీ స్టెప్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి