Manchu Lakshmi Steps : బాస్ పార్టీ సాంగ్‌.. మంచు లక్ష్మీ స్టెప్పులు

Waltair Veerayya Boss Party Song చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ సాంగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. యాభై మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టిన బాస్ పార్టీ సాంగ్‌కు మంచు లక్ష్మీ వేసిన చిందులు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2022, 01:34 PM IST
  • ట్రెండింగ్‌లో వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్
  • చిరు స్టెప్పులను ఫాలో అవుతున్న సెలెబ్రిటీలు
  • మంచు లక్ష్మీ చిందులపై నెటిజన్ల కామెంట్స్
Manchu Lakshmi Steps : బాస్ పార్టీ సాంగ్‌.. మంచు లక్ష్మీ స్టెప్పులు

Manchu Lakshmi Steps for Boss Party Song మంచు లక్ష్మీ తాజాగా బాస్ పార్టీ అంటూ వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్అవుతున్నాయి. రంగస్థలం మహేష్, మంచు లక్ష్మీ కలిసి వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ పాటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే యాభై మిలియన్ల వ్యూస్‌తో బాస్ పార్టీ ట్రెండ్ అవుతోంది. ముందు ఈ పాట మీద ఎంత ట్రోలింగ్ నడిచిందో అందరికీ తెలిసిందే. కానీ మెల్లిగా అదే స్లోపాయిజన్‌లా ఎక్కేసింది.

అసలే బాలయ్య వీర సింహా రెడ్డి కోసం తమన్ కొట్టిన పాటలు.. చిరు వాల్తేరు వీరయ్య కోసం దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన పాటల మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది. ముందు బాస్ పార్టీ సాంగ్ వచ్చింది. ఆ వెంటనే జై బాలయ్య సాంగ్ వచ్చింది. ముందు వచ్చిన బాస్ పార్టీ సాంగ్‌ను తెగ ట్రోల్ చేశారు. కానీ జై బాలయ్య అంటూ ఒసెయ్ రాములమ్మ పాటను కాపీ కొట్టడంతో తమన్ అడ్డంగా బుక్కైపోయాడు.

 

అలా వీర సింహా రెడ్డి నుంచి వచ్చిన ప్రతీ పాట మీద వాల్తేరు వీరయ్య పాటలు పై చేయి సాధిస్తున్నాయి. ఈ కొత్త ఏడాది సెలెబ్రేషన్స్‌లో బాస్ పార్టీ సాంగే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. సెలెబ్రిటీలు సైతం బాస్ పార్టీ సాంగ్‌కు ఇలా రీల్స్ చేస్తూ ఉన్నారు. స్టెప్పులు వేస్తున్నారు.

మొత్తానికి మంచు లక్ష్మీ మాత్రం చిరు పాటలకు ప్టెప్పులు వేయడం గురించి స్పందించింది. చిరంజీవి పాటలకు స్టెప్పులు వేయడం అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి మధ్య సంక్రాంతికి గట్టిపోటీనే ఉండేట్టు కనిపిస్తోంది.

Also Read : Spyder Agnyaathavaasi Losses : స్పైడర్, అజ్ఞాతవాసి నష్టాలు.. వేరే వాళ్లు అయితే సూసైడ్ చేసుకునేవాళ్లట.. దిల్ రాజు కామెంట్స్

Also Read : Vijay Jana Gana Mana : ఈ ఏడాదిలో ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్‌లు.. ప్లాన్స్ మార్చిన ఎన్టీఆర్, విజయ్, రామ్ చరణ్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News