"కబడ్డీ మైదానంలో ఆడితే ఆట... బయట ఆడితే వేట" అంటూ గోపీచంద్ (Gopichand) చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ తో విజిల్స్ కొట్టిస్తోంది. ఆయన నటించిన 'సీటిమార్' సినిమా ట్రైలర్ (Seetimarr trailer) విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ ను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Hero Ram Pothineni) రిలీజ్ చేశారు. సీటిమార్ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం (Director Sampath nandhi) వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia)నటిస్తోంది. ఆమెతో పాటు భారీ తారాగణం ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్, పవర్ ఫుల్ డైలాగ్ లతో ట్రైలర్ లో తనలోని మాస్ యాక్టింగ్ (Mass Acting)ను గోపీచంద్ మరోసారి బయటపెట్టారు. ఆయన చెప్పిన డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ' రూల్స్ ప్రకారం ఆడితే ఆడివస్తారు, రూట్ లెవల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్ లో వస్తారు' అనే డైలాగ్, ప్రస్తుతం సమాజంలో అమ్మాయి పరిస్థితులపై చెప్పిన 'బయటకు వెళ్లేటపుడు కావాల్సింది మగాడి తోడు కాదు, ధైర్యం అనే తోడు' లాంటి మాస్ డైలాగ్ లు అంతే పవర్ ఫుల్ గా చెప్పారు గోపిచంద్. తమన్నా భాటియా అందచందాలు, చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించారు. భూమిక చావ్లా (Bhumika chavla) ఆమె ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రావు రమేశ్ (Ravu ramesh)విలనిజంతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.


Also Read: Digital Gold: ఒక్క రూపాయితోనే బంగారం కొనొచ్చు.. అదెలాగంటే..??



కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా భాటియా (Gopichand, Tamannah Bhatia) కబడ్డీ కోచ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు సక్సెఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ (Manisharma)సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కరోనా కారణంగా అనేకసార్లు వాయిదా పడుతూ ఈ చిత్రం వినాయక చవితిని (Ganesh chathutrhi) పురస్కరించుకుని సెప్టెంబర్ 10వ తేదీన థియేటర్లలలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.


ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు అనువుగా కట్ చేసినట్లుగా ఉంది. గోపీచంద్ సినిమా తరహాలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ లు సీటీమార్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆటలు, ఆడవాళ్ల నేపథ్యంలో సాగే సినిమాగా కనిపిస్తున్న ఈ చిత్రంలో ఎమోషన్ సీన్లు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మహిళలపై జరిగే వివక్ష, ఆటల్లో ఆడవారిని రానివ్వకుండా ఈ సమాజం ఎలాంటి అవమానాలకు గురి చేస్తుందో క్లియర్ గా వివరించినట్లు కనిపిస్తోంది. ఇక పొట్టి పొట్టి బట్టలపై ఎలాంటి కామెంట్లు చేస్తుందో ట్రైలర్‌లో చూపించారు. "వారు వేసుకునే బట్టల సైజుతోనే వారి క్యారెక్టర్‌ను గుర్తిస్తారు" అంటూ రాసిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.


Also Read: Dale Steyn: ఆటకు గుడ్ బై చెప్పిన స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్...అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన


సీటీమార్‌లో సౌత్, నార్త్ ఇండియా (South India, North India) వివక్షను కూడా అక్కడక్కడ టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. "సౌత్ కా సత్తా మార్ కే నై.. సీటీమార్ కే దికాయేంగే " (సౌత్ సత్తా ఏంటో ఇలా కొట్టి చెప్పం. సీటీ కొట్టి మరీ చెబుతాం) అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ బాగుంది. ఇందులో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. గోపీచంద్‌ నుంచి కోరుకునే మాస్ అంశాలతో పాటు, భావోద్వేగాలను కూడా జోడించారు. మొత్తానికి ఈ మూవీ మాస్ ప్రేక్షకులనే కాకుండా ప్రతీ ఆడియెన్‌ను కట్టిపడేసేలా ఉంది.


గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో 2017లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం ఆశించిన విజయాన్ని సాధించింది. ఆ చిత్రం తర్వాత వారిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తున్న సీటీమార్ పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరీ అంచనాలను రీచ్ అవుతుందా లేదా చూడాలి. ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ తో సీటీలు కొట్టించేలా ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook