New Movie Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న కొత్త సినిమాల జాబితా ఇదే

New Movie Releases: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో, ఓటీటీ వేదికలు కొత్త సినిమాలతో సిద్ధమవుతున్నాయి. ప్రేక్షకుల్ని రంజింప చేసేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం కొత్త సినిమాల జాబితా భారీగానే ఉంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 30, 2021, 01:07 PM IST
New Movie Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న కొత్త సినిమాల జాబితా ఇదే

New Movie Releases: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో, ఓటీటీ వేదికలు కొత్త సినిమాలతో సిద్ధమవుతున్నాయి. ప్రేక్షకుల్ని రంజింప చేసేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం కొత్త సినిమాల జాబితా భారీగానే ఉంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

కరోనా మహమ్మరి(Corona Pandemic)కేసులు తగ్గడంతో దేశవ్యాప్తంగా థియేటర్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో కొత్త సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ధియేటర్లు సిద్ధమౌతున్నాయి. అటు థియేటర్లు, ఇటు ఓటీటీ వేదికలు రెండూ కొత్త సినిమాలతో పోటీ పడుతున్నాయి. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. థియేటర్‌లో విడుదలైన సినిమాలను వారంలోపే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. ఈ క్రమంలో ఈ వారం విడుదల కానున్న కొత్త సినిమాల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.

అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas)హీరోగా నటించిన 101 జిల్లాల అందగాడు సెప్టెంబర్ 3వ తేదీన ధియేటర్లలో విడుదల కానుంది. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. ఇక మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు నటించిన డియర్ మేఘ కూడా సెప్టెంబర్ 3వ తేదీనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ ప్రేమకధా చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇదే రోజు విడుదల కాబోతున్న మరో సినిమా ది కిల్లర్. క్రైమ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి చిన్నా దర్శకత్వం వహించారు. కార్తీక్ సాయి, నేహా దేశ్‌పాండే, డాలీషాలు ప్రధానపాత్రల్లో కన్పించనున్నారు. సుజన్, తనిష్క్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లలో(Theatres)విడుదల కానుంది. ఇదే రోజు విడుదల కానున్న మరో సినిమా అశ్మీ. రుషికా రాజ్, రాజ నరేంద్ర, కేశప్ దీపకప్, ఇందు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానున్న భారీ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9. ఇప్పటి వరకూ ఈ పేరుతో 8 సినిమాలు విడుదలై కాసుల వర్షం కురిపించాయి. ఇది కూడా సెప్టెంబర్ 3వ తేదీనే విడుదల కానుంది. 

ఇక ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో(Amazon prime) సిండ్రెల్లా సినిమా సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 3 వ తేదీన బ్లాక్‌విడో, షాంఘ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్ విడుదల కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) ఆగస్టు 31న స్పార్కింగ్ జాయ్, గుడ్‌గర్ల్స్ సినిమాలు విడుదల కానుండగా..సెప్టెంబర్3 వ తేదీన మనీ హెయిస్ట్ 5వ సీజన్ వెబ్‌సిరీస్ విడుదలవతోంది. ఇక జీ5లో(Zee5)హెల్మెట్ సెప్టెంబర్ 3న విడుదల కాబోతుంది. 

Also read: PV Sindhu: పీవీ సింధుకు చిరంజీవి సత్కారం...మెగాస్టార్ ఇంట్లో సందడి చేసిన తారలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News