Vedaant Won 5 Gold Medals హీరో మాధవన్ కొడుకు వేధాంత్ స్విమ్మింగ్ పూల్‌ పోటీల్లో మళ్లీ బంగారు పతకాలు సాధించాడు. మలేషియా గడ్డ మీద ఈ సారి వేధాంత్ తన సత్తా చాటు. ఐదు బంగారు పతకాలు సాధించి అదరగొట్టేశాడు. 50, 100, 200, 400, 1500 మీటర్ల విభాగంలో వేధాంత్ సత్తా చాటి బంగారు పతకాలు సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో మాధవన్ కొడుకు మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామూలుగా అయితే హీరోల కొడుకులు ఎలా తయారవుతుంటారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంతా కూడా పబ్బులు, పార్టీలు, డ్రగ్స్ అంటూ వెస్ట్రన్ కల్చర్‌కు అలవాటు పడుతున్నారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతా కూడా డ్రగ్స్ బ్యాచ్ అని అంటుంటారు. కానీ మాధవన్ మాత్రం తన కొడుకుని ఎంతో గొప్పగా పెంచినట్టు కనిపిస్తోంది.


 



మాధవన్ తాజాగా తన కొడుకు సాధించిన ఘనతను చెబుతూ మురిసిపోయాడు. పుత్రోత్సాహతంతో మాధవన్ సంతోషంతో గాల్లో తేలిపోతోన్నట్టుగా ఉంది. మాధవన్ వేసిన ఈ ట్వీట్‌ను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా మున్ముందు పతకాలు సాధించి.. దేశానికి గర్వకారణమవ్వాల్ని కోరారు. మాధవన్, వేదాంత్ పట్ల సోషల్ మీడియాలో ఎప్పుడూ పాజిటివ్‌ వైబ్స్ ఉంటాయని తెలిసిందే.


Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్


మాధవన్ తాజాగా ఏ సినిమాను ఒప్పుకున్నట్టుగా కనిపించడం లేదు. విలన్‌గానూ, హీరోగానూ మాధవన్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో అయితే విలన్‌గానూ మాధవన్ ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో మాధవన్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలోనూ భిన్న పాత్రను పోషించిన విషయం తెలిసిందే.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook