Nani Ante Sundaraniki Teaser: నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ మూవీ 'అంటే సుందరానికి..' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, రేపు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజును పురస్కరించుకుని.. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అందులో నాని పలికిన సంభాషణలు ఆద్యంతం నవ్వు తెప్పించేలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'యువ సుందరుడి నవ్వుల హోమం మొదలైంది' అనే పోస్టర్‌తో 'అంటే సుందరానికి' టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'పుట్టినరోజున ఏంటే ఇది.. ఇంకెన్ని హోమాలు చేయాలి... ఇంకో రెండు హోమాలు చేశానంటే గిన్నీస్ బుక్‌లోకి ఎకొచ్చు.', 'బయటకెళ్తే ద్విచక్ర వాహన గండం.. నీళ్లలో దిగితే జలగండం.. నడిస్తే రోడ్డు గండం.. కూర్చొంటే కుర్చీ గండం.. దీనమ్మ గండం..', 'చిన్నప్పటి నుంచి హోమాలు చేసి చేసి మొహం పగిలిపోతుంది.' అంటూ నాని పలికిన డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.




'అంటే సుందరానికి' విడుదలకు సంబంధించి.. అంతకుముందు మేకర్స్ ఏడు రిలీజ్ డేట్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22, 29, మే 6, 20, 27, జూన్ 3, 10 తేదీల్లో ఏదో ఒక తేదీన సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు జూన్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని-నజ్రియా హీరో హీరోయిన్లుగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 



Also Read: Secret Whatsapp Tips: మీ గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్‌లో గంటల తరబడి ఆన్‌లైన్‌లో ఉంటుందా..? ఎవరితో చాట్ చేస్తుందో ఇలా తెలుసుకోండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook