Freedom at Midnight Web Series: సూపర్ రెస్పాన్స్ తో ఆకట్టుకుంటోన్న హిస్టారికల్ ..పొలిటికల్ థ్రిల్లర్ .. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’..
Freedom at Midnight Web Series: ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో అలరిస్తున్న ఓటీటీ మాధ్యమం సోనీ లివ్ లో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరిస్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. తాజాగా స్వాతంత్య్రం రావడానికి మన జాతీయ నేతల మహాత్మ గాంధీ, నెహ్రూ, జిన్నాలు కలిసి బ్రిటిష్ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ నవంబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Freedom at Midnight Web Series: తెలుగు సహా విభిన్న భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ తో ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సోనీ లివ్. తాజాగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో స్వాతంత్య్రం సిద్దించే ముందు బ్రిటిష్ వాళ్లతో మహాత్మ గాంధీ, నెహ్రూ, జిన్నాలు కలిసి ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారనే నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ హిస్టారికల్ సోషల్ పొలిటికల్ డ్రామాను మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, డానిష్ ఖాన్ నిర్మించారు.
చిరాగ్ వోరా, సిద్ధాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా, ల్యూక్ ల్యూక్ మెక్‌గిబ్నే తదితరులు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మన దేశానికి స్వతంత్రం రావటానికి ఎందరో నాయకులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆనాటి పరిస్థితులను, భారత విభజనకు దారితీసిన పరిణామాలను, మన నాయకులు- గాంధీ, నెహ్రూ, పటేల్ తదితరులు ఎదుర్కొన్న సవాళ్లు, సంఘర్షణను ఈ వెబ్ సిరీస్ లో అత్యద్భుతంగా తెరకెక్కించారు.
మొత్తంగా అప్పటి నాయకులు స్వాతంత్య్రం సిద్దించేందుకు ఎదుర్కున్న తీరును అద్భుతమైన మేకింగ్‌తో కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారు మేకర్స్. నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. SCAM 1992, SCAM 2003,మహారాణి లాంటి బ్లాక్ బస్టర్ షోల తర్వాత, సోనీ లివ్ నుండి వచ్చిన మరొక అద్భుతమైన సిరీస్ - ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్.
ఈ సందర్భంగా..దర్శకుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘‘‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ వంటి హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించాలనుకోవటం ఎంతో క్లిష్టమైనదనే చెప్పాలి. ఆనాటి పరిస్థితులను తాను చదివిన కొన్ని పత్రికలతో పాటు వాటిని విశ్లేషిస్తూ తెరకెక్కించడం ఎంతో కష్టసాధ్యమైన పనిగా అభివర్ణించారు. అయితే దాన్ని మా మేకర్స్ నిజం చేశారు. నాటి వాస్తవ పరిస్థితులను ఈ సిరీస్ ద్వారా వివరించే ప్రయత్నం చేశామన్నారు. నవంబర్ 15 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఆడియెన్స్‌ను ఈ సిరీస్ అలరిస్తోందన్నారు.
నిర్మాతలు మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, డానిష్ ఖాన్ మాట్లాడుతూ ‘‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరీస్‌కు లభిస్తున్న ఆదరణకు ప్రేక్షకులకు పేరు పేరునా ధన్యవాదాలు. మనం ఈరోజు సంతోషంగా ఉండటానికి కారణం .. ఎందరో అమరవీరుల త్యాగఫలం. నాటి విషయాలను, దేశ విభజన సమయంలో మన నాయకులు ఎదుర్కొన్న కష్టనష్టాలను, ఆనాటి పొలిటికల్ సిట్యూవేషన్స్ ను నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన తీరు అద్భుతం అన్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter