Allu Arjun: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏడ్చేసిన అల్లు అర్జున్, సుకుమార్.. అభిమానులు కూడా కన్నీళ్లు
Icon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్ ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
Allu Arjun Sukumar Tears: సినీ పరిశ్రమలో వారిద్దరి జీవితం దాదాపుగా ఒకే సమయంలో ప్రారంభమైంది. సుదీర్ఘ కాలంగా విజయవంతంగా కొనసాగుతున్న వారి సినీ జీవితం.. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తలచుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్ కన్నీళ్లు పెట్టేశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించిన ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగంతో నిండిపోయింది. ముఖ్యంగా సుకుమార్, అల్లు అర్జున్ దాంతోపాటు సుకుమార్ సతీమణి తబితా ఇలా అందరూ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'
పుష్ప 2 ది రూల్ దాదాపు మూడేళ్లు తీశారు. పుష్ప 1, 2 సిరీస్‌కు కలిపి దాదాపు ఐదేళ్లు సుకుమార్, అల్లు అర్జున్ కలిసి పని చేశారు. ఈ సందర్భంగా ప్రి రిలీజ్ వేడుకలో సుకుమార్ సినిమా వర్కింగ్ స్టిల్స్‌తోపాటు అల్లు అర్జున్‌తో ఉన్న అనుబంధాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. ఇక ఈవెంట్‌లో సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్‌తో ఉన్న బంధంపై కొంత భావోద్వేగంగా మాట్లాడారు. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ సుకుమార్, బన్నీతోపాటు బబితా కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: YS Sharmila: సముద్రంలో పవన్ కల్యాణ్ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి
సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్నా జోడీగా అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమా చేశారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రి రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.1,200 కోట్లు దాటిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 1,200కు పైగా థియేటర్‌లలో 6 భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. సినిమా టికెట్లు ఇప్పటికే అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశారు. ఈ సినిమాలో దాక్షాయణిగా అనసూయ, శ్రీవల్లీగా రష్మిక నటిస్తుండగా.. కిస్సిక్ అనే పాటలో ప్రత్యేకంగా శ్రీలీల కనిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.