Manjummel Boys Controversy: నిజజీవిత ఘట్టాల ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రం కేరళలో బాక్స్ ఆఫీసు ను షేక్ చేసింది. భారీ విజయాన్ని సాధించింది. మలయాళంలో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తరువాత తెలుగులో కూడా విడుదల అయ్యి.. ధియేటర్లలో బాగానే కలెక్షన్లు రాబట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ తాజాగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా లీగల్ ఇబ్బందుల్లో పడింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. వివరాల్లోకి వెళితే సినిమా కథ మొత్తం కొడైకెనాల్‏ కి టూర్ కి వచ్చిన కొందరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు కమల్ హాసన్ గుణ షూటింగ్ జరిగిన గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. అక్కడే ఒకరు ఆ గుహలో పడిపోతారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తమ స్నేహితుడిని వాళ్ళు ఎలా రక్షించుకున్నారు అనేదే సినిమా కథ. 


నిజ జీవితంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‏లో కమల్ హాసన్ గుణ చిత్రంలోని కన్మణి అన్బోడు పాటను ఉపయోగించారు. ఆ సినిమా ఈ పాటను అందించింది ఇళయరాజా. అప్పట్లో రికార్డులు బద్దలుకొట్టిన పాట అది.  


అయితే తమ అనుమతి లేకుండా ఈ పాటను వాళ్ళు వాడుకున్నందుకు గాను.. చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ లీగల్ నోటీసులు జారీ చేశారు. కాపీరైట్ చట్టం ప్రకారం.. ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందుతాయని కానీ వాళ్ళు ఇళయరాజా అనుమతి లేకుండానే.. తమ సినిమాలో ఈ పాటను ఉపయోగించారని వారి వాదన. దాని వల్ల చిత్ర బృందం ఇప్పుడు తగిన పరిహారం చెల్లించాలని వారు నోటీసులో పేర్కొన్నారు. లేదా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.


ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..


ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook