Importance of Holi: హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. కాముని పున్నమి అని ఎందుకు అంటారంటే?
Holi Festival Importance: అయితే హోలీ పండుగ ఎలా ప్రారంభమైంది? ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? అనే విషయాలు మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Reasons for Celebrating Holi Festival: దీపావళి తర్వాత దేశం మొత్తం అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ కూడా ఒకటి. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా అందరూ పండుగ చేసుకునేందుకు సిద్ధమైపోతూ ఉంటారు. అయితే ఈ పండుగ ఎలా ప్రారంభమైంది? ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? అనే విషయాలు చాలా మందికి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో దాని మీద కొంత మాకున్న సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
సత్య యుగం నుంచి
హోలీ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. అసలు హోలీ అంటే అగ్ని లేదా అగ్ని వల్ల పునీతమైనది అని అర్థమట. అలాగే హోలీ పండుగను చాలా చోట్ల హోలికా పూర్ణిమ అనే పేరుతో కూడా సంబోధిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుతూ ఉంటారు. హోలీ, కాముని పున్నమి, డోలోత్సవం, డోలికోత్సవం అనే పేర్లతో కూడా తెలుగు నాట ఈ పండుగను ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక ఈ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి పురాణాల్లో అనేకమైన కథలు ఉన్నాయి.
ప్రహ్లాదుని చంపబోయి
రాక్షస రాజు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు ప్రతిరోజు విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటే అది హిరణ్యకశిపుడికి ఏ మాత్రం నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని చంపేయాలని నిర్ణయించుకుని తన రాక్షస సోదరి హోలీకని పిలుస్తాడు. ఆమెకు ఉన్న రాక్షస శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరితే వెంటనే ఆమె ప్రహ్లాదుడిని ఒంట్లో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయట పడితే హోలీక మాత్రం ఆ మంటల్లో బలైపోతుంది. అలా హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఒకటుంది. అందుకే చాలా ప్రాంతాలలో రాత్రివేళ హోలికను దహనం చేస్తారు.
డోలోత్సవం
అలాగే కొన్ని ప్రాంతాలలో హోలీ రోజున డోలోత్సవం లేదో డోలికోత్సవం జరుపుతారు. ఆరోజు శ్రీకృష్ణుని గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. రంగులు పువ్వులు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు పెంపొందుతాయని వారు నమ్ముతారు.
హోళికా గురించి మరో కథ
కృత యుగంలో రఘునాథుడు అనే సూర్యవంశానికి చెందిన మహారాజు పాలిస్తూ ఉండగా ఒకరోజు ఆ రాజ్యానికి చెందిన ప్రజలందరూ వచ్చి హోలీ గానే రాక్షసి తమను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని చెబుతూ ఆ పూజలు పగటి పూట చేస్తే కష్టాలు పెరుగుతాయని రాత్రివేళ చేస్తే పోతాయని చెబుతాడు. దీంతో అప్పటినుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లుగా పూర్వీకులు చెబుతూ ఉంటారు.
Also Read: Rahu-Shukra Yuti: రాహు-శుక్ర సంయోగం వల్ల వీరికి కష్టాలు పెరుగుతాయి.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి