Coins in Rivers: నదిలో నాణేలు ఎందుకు విసురుతుంటారు, దీని వెనుక ఉన్న లాజిక్ మీకు తెలుసా, కోర్కెలు నెరవేరడం నిజమేనా

Coins in Rivers: నదీ నదాల్లో సముద్రాల్లో ప్రవహించే వాగులు వంకల్లో కాయిన్స్, ఇతర వస్తువులు వేయడం అనాదిగా వస్తున్న అలవాటు. ఇలా చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయనేది కొందరి నమ్మకం. ఇది నిజమా కాదా, అసలు నదుల్లో కాయిన్స్ వేయడం వెనుక మతలబేంటనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2023, 08:09 AM IST
Coins in Rivers: నదిలో నాణేలు ఎందుకు విసురుతుంటారు, దీని వెనుక ఉన్న లాజిక్ మీకు తెలుసా, కోర్కెలు నెరవేరడం నిజమేనా

ఇండియాలో చాలాకాలంగా ఓ అలవాటుంది. మనస్సులో కోర్కెలు నెరవేర్చుకునేందుకు పలు నమ్మకాల్ని పాటిస్తుంటారు. ఇందులో ఒకటి నదీ నదాల్లో ప్రవాహాల్లో కాయిన్స్, ఇతర వస్తువుల్ని వేయడం. నదిలో నాణేలు వేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయనేది అనాదిగా వస్తున్న ఓ విశ్వాసం, ఓ నమ్మకం. ఇది ఎంతవరకూ నిజం..

నదీ నదాల్లో, సముద్రాల్లో, బావుల్లో సులభంగా చెప్పాలంటే నీళ్లలో నాణేలు వేయడం చాలాకాలంగా వస్తున్న ఓ అలవాటు లేదా ఓ నమ్మకం. అందుకే ముఖ్యంగా రైళ్లోంచి వెళ్లేటప్పుడు ఏదైనా నది దాటుతున్నక్రమంలో కిటికీలోంచి డబ్బులు విసిరి నదిలోకి వేస్తుంటారు. రోడ్డు మార్గం ద్వారా అయితే వంతెన దాటేటప్పుడు ఆపి మరీ రూపాయో, రెండు రూపాయలో, 5 రూపాయల నాణెమో వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయనేది ఓ ప్రధాన నమ్మకం. నదిలో నాణేలు వేయడం వల్ల నిజంగానా కోర్కెలు నెరవేరుతాయా, దీని వెనుక ఉన్న ఏదైనా మతలబు ఉందా అనేది తెలుసుకుందాం..

నీళ్లలో నాణేలు

నీళ్లలో ముఖ్యంగా నదుల్లో నాణేలు వేయడమనే అలవాటు అనాదిగా అంటే ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. ప్రవహించే నీళ్లలో వస్తువులు లేదా నాణేలు వేయడం వల్ల మంచి జరుగుతుందనేది ఓ నమ్మకం. ముఖ్యంగా హిందూమతంలో ఉన్న విశ్వాసం. నదిలో నాణేలు వేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయా లేదా అనేది ఒకరి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కొందరు దీనిని అంధ విశ్వాసంగా కొట్టిపారేస్తారు. మరికొందరు అర్ధం లేని చర్యగా అభివర్ణిస్తుంటారు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా దీని వెనుక మతలబు మాత్రం ఉందంటున్నారు ఇంకొందరు. 

వాస్తవానికి పాతకాలంలో రాగి లేదా ఇత్తడి వస్తువుల్ని నీళ్లలో ప్రవహింపజేసేవారు. ఒకప్పుడు రాగి నాణాలు చలామణిలో ఉండేవి. రాగి అనేది నీళ్లను శుభ్రపరుస్తుందంటారు. అందుకే పాతకాలంలో నాటి ప్రజలు ఎప్పుడు నది లేదా చెరువు లేదా బావుల వద్దకు వెళ్లినా..అందులో రాగి నాణేలు వేసేవారు. దీనివల్ల నీళ్లు శుభ్రమౌతాయని నమ్మకం.

జ్యోతిష్యశాస్త్రంలో కూడా ఈ విషయమై ప్రస్తావన ఉంది. ఎవరి దోషమైనా దూరం చేసేందుకు సంబంధిత వ్యక్తులు నాణేలులేదా కొన్ని వస్తువుల్ని నీళ్లలో ప్రవహింపజేయాలి. అందుకే రాగి నాణేలు నీళ్లలో వేస్తుంటారు. కేవలం రాగి నాణెమే కాకుండా..వెండి నాణేలు నీళ్లలో వేయడం వల్ల కూడా దోషం తొలగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. 

Also read: Saturn Sun Mercury Conjuntion 2023: ఆ మూడు రాశులకు ఊహించని ధనలాభం, పదోన్నతులు, ఉద్యోగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News