SPB News: వెంటాటి వెంటాడి వేధించి తీసుకెళ్లిపోయింది: గాయని సుశీల ఆవేదన
పాటల ప్రపంచంలో చెరగని ముద్రవేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( Singer SP Balasubrahmanyam ) మృతి పట్ల సర్వత్రా విషాదం నెలకొంది. వెంటాడి వెంటాడి వేధించి మరీ తీసుకెళ్లిపోయిందంటూ గాయని పి సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం మరణంపై మరో ప్రముఖ గాయని పి సుశీల ( playback singer p susheela ) విచారం వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో రారాజుగా సాగిన బాలు మరణంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరి ఆప్తుడైన బాలును..కరోనా మహమ్మారి ( Corona pandemic ) వెంటాడి వెంటాడి వేధించి మరీ తీసుకెళ్లిపోయిందంటూ కంట తడిపెట్టారు సుశీల. కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి ఇంతగా అలజడి రేపుతుందనుకోలేదని తెలిపారు. తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎస్సీ బాలు మరణం తనకు వ్యక్తిగతంగా దెబ్బ అని చెప్పారు. గుండె ధైర్యం తెచ్చుకుని..విషాదం నుంచి కోలుకోవాలంటూ అభిమానులకు సూచించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
మరోవైపు చెన్నై శివారు ప్రాంతంలోని బాలు ఫామ్ హౌజ్ ( Cremations at Balu Farmhouse in chennai ) లో అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. కరోనా వైరస్ సంక్రమణ, నిబంధనల దృష్ట్యా అంత్యక్రియలకు ప్రజలెవర్నీ అనుమతించలేదు. కుటుంబ సభ్యులు, ప్రముఖులు మినహా మిగిలినవారెవ్వరినీ మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతి లభించలేదు. ఫామ్ హౌస్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే అభిమానుల్ని నియంత్రించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ బారిన పడి...ఆగస్టు 5న ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన బాల సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25 ( SP Balasubrahmanyam died on September 25 ) న తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ ఎక్మోతో పాటు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. బాలు ఆరోగ్యం మెరుగుపడుతోందంటూ వార్తలు వచ్చినప్పుడు అభిమానులంతా ఆనందించారు. కొద్దిరోజుల్లే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా భావించారు. కానీ అంతలోనే మరోసారి ఆరోగ్యం క్షీణించి..ఇక ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేశారు.
కరోనా వైరస్ బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పట్నుంచి ఎక్మోతో పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. కానీ సెప్టెంబరు 24న ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. చివరకు శుక్రవారం ఉదయం తుది శ్వాస తీసుకున్న సంగతి తెలిసిందే. Also read: Tollywood: సెప్టెంబరు 25 టాలీవుడ్‌కు బ్లాక్ డే.. ఇప్పుడు బాలు, అప్పుడు వేణు