Inspector Rishi: భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వినోద మాధ్యమం ప్రైమ్ వీడియో. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ రోజు భారతదేశంలోని ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్‌లోని ఒక గ్రాండ్ ఈవెంట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ ఒరిజినల్ హారర్ క్రైమ్ డ్రామా సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. తాజాగా ఈ హార్రర్ క్రైమ్ డ్రామా సిరీస్ గ్రిప్పింగ్ ట్రైలర్‌ను ఆవిష్కరించింది. నందిని JS రూపొందించిన ఈ సిరీస్ లో నటుడు నవీన్ చంద్ర టైటిల్  రోల్ పోసించారు. ఈ సిరీస్‌లో సునైనా, కన్నా రవి, మాలినీ జీవరత్నం, శ్రీకృష్ణ దయాళ్ మరియు కుమారవేల్ వంటి ఇందులో నటించారు. పది ఎపిసోడ్‌లో ఈ సిరీస్‌ భారత్ సహా 240 పైగా దేశాల్లో మార్చి 29న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ట్రైలర్ విషయానికొస్తే.. ఈ ట్రైలర్‌లో తమిళనాడులోని ఒక అందమైన కుగ్రామం.. పచ్చదనంతో నిండిన బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఈ సిరీస్‌ను పిక్చరైజ్ చేశారు. అనూహ్ యమరణాలతో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో ఈ సిరీస్ ను ఆసక్తి రేకిస్తోంది.   ఇన్‌స్పెక్టర్, రిషి, ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లు అయ్యనార్ మరియు చిత్రతో కలిసి, అడవి రహస్యాలను ఎలా వెలికి తీసారు. మరియు  ఈ ఎక్కడా అంతు చక్కని సమస్యలను వీళ్లు ఎలా పరిష్కరించానేది ఈ సిరీస్ స్టోరీ. ఈ ముగ్గురూ తమ వ్యక్తిగత జీవితంలోని సవాళ్లు ఎదుర్కోవడమే కాకుండా, వారి సంకల్పం మరియు సామర్థ్యాలను పరిమితికి పరీక్షించే ఆటలో కొన్ని అద్భుతమైన అతీత శక్తులతో పోరాడుతారు.


'ఇన్‌స్పెక్టర్ రిషి' పాత్రను పోషించడం సవాలుతో కూడుకున్న పాత్ర. ఈ సిరీస్‌ నాకు ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ పాత్రతో నాలోని నటుడిని వెలికి తీసిందని నటుడు నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోతో నా రెండవ సిరీస్ కాబట్టి ఇన్‌స్పెక్టర్ రిషి పాత్ర పట్ల నా ఉత్సాహం పెరిగింది. ఈ సిరీస్ తో ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.



ఇన్‌స్పెక్టర్ రిషిలో ఫారెస్ట్ ఆఫీసర్ క్యాథీ పాత్రను చేసినట్టు సునైనా తెలిపారు. దర్శకుడు నా పాత్రను చాలా బాగా చూపించారు. ఆ కారెక్టర్ లో లక్షణాలు నాకు చాలా నచ్చాయి. సెట్‌లోని వాతావరణం, ప్రతిభావంతులైన నటీనటులు మరియు సిబ్బందితో కలిసి, కాథీ యొక్క సున్నితమైన మరియు భీకరమైన వ్యక్తిత్వాన్ని పూర్తిగా చూపించడానికి నాకు అవకాశం లభించిందన్నారు. నందిని JS మరియు ప్రైమ్ వీడియోతో పని చేసిన అనుభవం తనకు మరిన్ని అవకాశాలను తీసుకొస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది. ఇన్‌స్పెక్టర్ రిషి తో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తామని చెప్పారు.


Also Read:  Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే


Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter