Chatrapathi Hindi Remake: బాలీవుడ్‌కు వెళ్తున్న ఛత్రపతి.. మరో టాలీవుడ్ హీరోకు ఛాన్స్!
Chatrapathi Movie Hindi Remake | సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. నటనలో తనను మెరుగు పరుచుకుంటున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం అల్లుడు అదుర్స్ మూవీలో నటిస్తున్నాడని తెలిసిందే. ఛత్రపతి బాలీవుడ్ రీమేక్‌లో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
అల్లుడు శీనుతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంట్లో నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఈ యువ నటుడు తొలుత నటనలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆపై ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. నటనలో తనను మెరుగు పరుచుకుంటున్న టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) ప్రస్తుతం అల్లుడు అదుర్స్ మూవీలో నటిస్తున్నాడని తెలిసిందే.
ఈ ఆరడుగుల హీరోకు టాలీవుడ్‌తో పాటు హిందీ చిత్రసీమలోనూ పేరుంది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన మూవీలు హిందీలో డబ్బింగ్ అవుతుంటాయి. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో సుపరిచితుడే. ఈ నేపథ్యంలో ఓ విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. దర్శకదిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఓ తెలుగు సినిమాను ప్లాట్‌ఫాంగా వాడుకుని బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మూవీలో ఛత్రపతి ఒకటి. జక్కన్న, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి మూవీ ఇది. ఇప్పుడు ఈ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు బెల్లంకొండ శ్రీనివాస్ అయితే సరిగ్గా సెట్ అవుతాడని బాలీవుడ్‌లో చర్చ జరిగిందని సమాచారం. ఈ హీరోను సంప్రదించగా.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలో డైరెక్టర్, హీరోయిన్ టెక్నీషియన్ల వివరాలు వెల్లడిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకోబోతోన్న తెలుగు హీరోకు టాలీవుడ్ ప్రేక్షకులు ఆల్ ది బెస్ట్ చెబుతూ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe