Shruti Haasan Bigg Boss: బిగ్‌బాస్‌ తమిళం సీజన్‌-5 హోస్ట్‌గా స్టార్ హీరోయిన్ చేయనుందట. ఆమె ఎవరో కాదు కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రియాలిటీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆమె తండ్రి కమల్ హాసన్ కరోనా బారిన పడిన నేపథ్యంలో.. బిగ్ బాస్ షో కు ఈ రెండు వారాలు శ్రుతిహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న కమల్‌కు స్వల్ప కరోనా లక్షణాలు కనబడటం వల్ల పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో ఐసోలేట్‌ అయి చికిత్స తీసుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారాయన. ఈ నేపథ్యంలో తమిళ బిగ్‌బాస్‌-5లో ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కమల్‌ స్థానంలో తాత్కాలికంగా..ఆయన కుమార్తె శ్రుతిని తీసుకున్నారనే మాట తెగ వినిపిస్తోంది. అతడి స్థానంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ఆయన కుమార్తెను షో మేకర్స్ శ్రుతిహాసన్‌ని సంప్రదించారట. దీనిపై శ్రుతి త్వరలో ఓ క్లారిటీ ఇవ్వనుంది.


తెలుగులో గతేడాది బిగ్‌బాస్-4లో షూటింగ్‌ కారణంగా నటుడు నాగార్జున పాల్గొనలేని సందర్భాల్లో నటి రమ్యకృష్ణ, సమంత ఆయన స్థానంలో ప్రేక్షకులను అలరించారు. మరి తమిళ బిగ్‌బాస్‌లో ఏమువుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మరి!  


Also Read: Chiranjeevi: 'అద్భుతం' మూవీపై చిరు ట్వీట్..నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు..


Also Read: Naga Chaitanya: 'థాంక్యూ' మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల...హ్యాండ్సమ్ గా చైతూ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook