Naga Chaitanya: 'థాంక్యూ' మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల...హ్యాండ్సమ్ గా చైతూ..

Naga Chaitanya: నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా...'థాంక్యూ' మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో చైతూ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 07:05 PM IST
Naga Chaitanya: 'థాంక్యూ' మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల...హ్యాండ్సమ్ గా చైతూ..

Naga Chaitanya: యువనటుడు అక్కినేని నాగఛైతన్య(Naga Chaitanya Akkineni) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చైతూ సినిమాలకు సంబంధించి టీజర్లు, పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే 'బంగార్రాజు'(Bangarraju) నుంచి చైతూ టీజర్ విడుదల కాగా..తాజాగా 'థాంక్యూ' మూవీ(Thank You Movie) నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ లో నాగచైతన్య ఎప్పటిలానే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. విక్రమ్ కుమార్ కె దర్శకుడు. చైతూకు జోడీగా రాశికన్నా నటిస్తోంది. అలాగే మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Also Read: 'బంగార్రాజు' టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదుర్స్..

నాగచైతన్య, విక్రమ్ కుమార్(Vikram Kumar K) కాంబినేషన్లో గతంలో‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. ప్రేమమ్ సినిమా తర్వాత నుంచి కథలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ కుర్ర హీరో. వరుసగా మజిలీ, లవ్ స్టోరీ సినిమాలతో విజయాలను అందుకున్నాడు.  మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘'లాల్ సింగ్ చద్ధా'’(Lal Singh Chadha)లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News