Mukku Avinash: తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీతో అందరినీ నవ్విస్తూ...తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ముక్కు అవినాష్‌(Mukku Avinash). త్వరలోనే ఈ జబర్దస్త్ కమెయడియన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల అవినాష్ నిశ్చితార్థం(Avinash Engagement) కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవినాష్ తన ఇన్‏స్టా(Instagram)లో షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘'సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు. మా కుటుంబాలు కలుసుకున్నాయి.. తర్వాత మేము కలుసుకున్నాం. ఇది మా నిశ్చితార్థం. చాలా మంది చాలా సార్లు నా పెళ్లి గురించి అడిగారు. అతి త్వరలోనే నా అనూజతో పెళ్లి. ఎప్పటి లాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఓ పోస్టు పెట్టాడు అవినాష్‌.


ఇక అవినాష్‌(Avinash) పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం తెలియగానే.. అమ్మాయి ఎవరన్న విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి. అవినాష్‌ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే తను. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది. 


Also Read: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కొత్త పేర్లు..! ఇక ఎవరెవరూ ఉండబోతున్నారంటే..!


జబర్దస్త్ కమెడియన్‌(Jabardast comedian)‌గా ఎంట్రీ ఇచ్చి ఆరంభంలోనే అద్భుతమైన టైమింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు ముక్కు అవినాష్. ఎన్నో షోస్ చేస్తూ కామెడీ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss)లో అడుగుపెట్టి తనలో వేరొక యాంగిల్ ను చూపించాడు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానా(Ariana)తో క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. దీంతో అవినాష్- అరియానా ఒక్కటవుతారనే టాక్ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో అలాంటి రూమర్లకు చెక్ పెట్టాడు అవినాష్. తాజాగా తను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook