Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కీలక మార్పులు.. తెరపైకి మరో నలుగురు..!

Bigg Boss 5 Telugu:  బుల్లితెరపై బిగ్‏బాస్ సందడి షురూ అయ్యింది. సెప్టెంబరు 5 నుంచి తెలుగు బిగ్ బాస్ ప్రారంభంకానుంది. అయితే  గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరికొన్ని కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. వారు ఎవరంటే...

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2021, 09:58 AM IST
Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కీలక మార్పులు.. తెరపైకి మరో  నలుగురు..!

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బిస్ సీజన్ 5 (Bigg Boss 5 )సెప్టెంబరు 5 నుంచి ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించిన తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ కంటెస్టెంట్స్(Bigg Boss 5 Contestants List) పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. రూమర్స్, గాసిప్స్, అప్డేట్స్‏తో నెట్టింట్లో సందడి కొనసాగుతోంది. ఇక బిగ్‏బాస్ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షో గురించి మొదటి నుంచి భిన్నరకాలుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అనుకున్నట్లుగానే ఈ షోను సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం చేయనున్నట్లుగా నిర్వహకులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతున్నాయి. 

ఇప్పటివరకు లోబో, ఇషా చావ్లా, సీరియల్ హీరో మానస్, సిరి హన్మంత్, యాంకర్ రవి, మోడల్ జశ్వంత్, షన్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, నటి శ్వేత, సీరియల్ నటి ప్రియ, జబర్దస్త్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి, సీరియల్ హీరో వీజే సన్నీ, యానీ మాస్టర్, కార్తీకదీపం భాగ్య (ఉమా), లహరి రాబోతోన్నట్టు ఓ లిస్ట్ వచ్చింది. పైగా ప్రియాంక, నవ్యస్వామి, యూట్యూబర్ నిఖిల్, ఆట సందీప్ భార్య జ్యోతి వంటి వారు రాబోతున్నట్లుగా టాక్ నడిచింది.

Also Read: Bigg Boss 5: అభిమానులకు గుడ్ న్యూస్...సెప్టెంబర్ 5 నుంచి బిగ్‌బాస్ షో ప్రారంభం

కొత్త పేర్లు ఏంటంటే..
తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు బిగ్‏బాస్(Bigg Boss) షోలోకి రాబోయే కంటెస్టెంట్స్ మారిపోయినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో వర్షిణి, ఇషాచావ్లా, నవ్వస్వామి పేర్లు వినిపించడం లేదు. వీరికి బదులుగా మరిన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అందులో నటుడు విశ్వ, యూట్యూబర్ సరయు, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, సింగర్ రామచంద్ర వంటి వారి పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరంతా క్యారంటైన్‏లో ఉన్నారని.. మూడో తేదీ వరకు వీరి మొబైల్స్ తమ దగ్గరే పెట్టుకుంటారని.. ఆ తర్వాత నిర్వహకులకు అప్పగిస్తారని.. 4న వీరంతా బిగ్‏బాస్ హౌస్‏కు వెళ్తారని.. 5న షో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ.. నాగార్జున(Nagarjuna).. పవర్ కళ్యాణ్ ఆరడుగుల బుల్లెట్టు పాటకు డ్యాన్స్ వేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల ఈ షోకు సంబంధించిన ప్రోమోను నిర్వహకులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ బజ్ ప్రోగ్రాంకు అరియానా(Ariana) హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే క్వారంటైన్‏లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ కరోనా(Covid) బారిన పడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించారని..అలాగే మిగతా కంటెస్టెంట్లకు కోవిడ్ టెస్ట్ నిర్వహించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరంతా క్షేమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరీ నిజంగా బిగ్ బాస్ ఇంట్లో ఉండేది ఎవరు? ఇలా లీకుల లిస్ట్‌లోనే ఉండేది ఎవరు? అనేది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News