Jai Bhim: హీరో సూర్య(Hero Surya) తాజాగా నటించిన చిత్రం ‘జై భీమ్‌(jai bhim)’. సోషల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఙానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దసరాను పురస్కరించుకుని ఈ మూవీ టీజర్‌(Jai Bhim Teaser)ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj), రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సూర్య న్యాయవాది పాత్రలో నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అణగారిన వర్గాలకు చెందిన ఒక మహిళకు జరిగిన అన్యాయంపై చంద్రు అనే లాయర్‌ ఎలా పోరాటం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొని ఆ మహిళకు న్యాయం చేశాడన్నది కథాంశం. ఇందులో పోలీసుల తరఫున వాదించే లాయర్‎గా రావు రమేష్ కనిపిస్తున్నారు. ఇందులో ‘కర్ణన్’ ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్‎గా నటించారు. ‘జై భీమ్’ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దీపావళీ సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక దంపతులు నిర్మిస్తున్నారు.



Also read: Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ రివ్యూ


ఇటీవల సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి