Most Eligible Bachelor: ప్రేమకథలు తెరకెక్కించడంలో బొమ్మరిల్లు భాస్కర్ స్టైల్ వేరు. లవ్ స్టోరీను వైవిద్యభరితంగా తెరపై ఆవిష్కరించటం ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం‘'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించారు. భాస్కర్ దాదాపు 8ఏళ్ల విరామం తీసుకున్న చేస్తున్న చిత్రమిది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
కథ:
మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలని నమ్మే వ్యక్తి హర్ష (అఖిల్ అక్కినేని). అందుకు తగ్గట్లే అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ.. మ్యారేజ్ లైఫ్ కోసం ముందే అన్నీ పక్కాగా సెట్ చేసుకుని పెట్టుకుంటాడు. తనపై తనకు ఉన్న నమ్మకంతో పెళ్లికి ముందే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని, అనుకున్న తేదీ కల్లా ఓ మంచి అమ్మాయిని వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. 20మంది అమ్మాయిల్ని పెళ్లిచూపులు చూసి.. వాళ్లలో మనసుకు నచ్చిన ఆమెతో ఏడడుగులు వేయాలన్నది తన ప్రణాళిక. తనలా పెళ్లిచూపులు చూడాలనుకున్న అమ్మాయిల్లో స్టాండప్ కమెడియన్ విభా అలియాస్ విభావరి (పూజా హెగ్డే) ఉంటుంది.
Also read: Aranya Movie: అరణ్య సినిమా ఓటీటీలో ఇవాళ్టి నుంచి అందుబాటులో
హర్షలాగే ఆమెకీ పెళ్లి విషయంలో.. రాబోయే జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలుంటాయి. అయితే ఆమెను పెళ్లి చూపులు చూడకముందే జాతకాలు కలవలేదన్న ఉద్దేశంతో హర్ష కుటుంబం.. ఆ సంబంధం కాదనుకుంటుంది. కానీ, హర్ష మాత్రం విభాను చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. ఆమెతోనే పెళ్లి పీటలెక్కాలని కలలు కంటాడు. అయితే విభా మాత్రం హర్ష ప్రేమకు నో చెబుతుంది. ఈ క్రమంలో పెళ్లి విషయంలో ఆమె అడిగిన కొన్ని ప్రశ్నలు.. హర్ష జీవితంలో పెను మార్పులకు కారణమవుతాయి. మరి ఆ ప్రశ్నలేంటి? వాటికి సమాధానం కనుక్కునే క్రమంలో హర్ష తెలుసుకున్న జీవిత సత్యమేంటి? చివరికి తాను అనుకున్నట్లుగా విభా ప్రేమని దక్కించుకున్నాడా? ఆమెతో పెళ్లి పీటలెక్కాడా? లేదా? అన్నది తెరపై చూడాలి.
ఎవరెలా చేశారంటే?
నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తొలి తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్నట్లు ఆమె పాత్ర డిఫరెంట్‌గా ఉండి అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి. క్లైమాక్స్ విషయంలో ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయారు. టెక్నికల్‌గా సినిమా బాగుందనిపించింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి.
చివరిగా: అఖిల్ కు ఈ సినిమా మంచి హిట్ అవుతుందనే చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి