Jr NTR Visits NTR Daughter Uma Maheshwari House: దివంగత నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆమె గత కొన్నాళ్లుగా డిప్రెషన్లో ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు, అయితే ఆమె ఒకటో తేదీన మరణించారు ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మినహా మిగతా కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉండటంతో వారందరూ కూడా ఆమెను కడసారి చూసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ జూనియర్ ఎన్టీఆర్ తన భార్యతో కలిసి విదేశాలలలో ఉండడంతో ఆయన వెంటనే భారత్ తిరిగి రావడం కుదరలేదు.  నిజానికి ఆమె ఒకటో తేదీన మరణించినా సరే ఆమె పార్థివ దేహాన్ని మూడో తేదీ వరకు భద్రపరచాలి వచ్చింది. ఎందుకంటే ఆమె పెద్ద కుమార్తె విశాల అమెరికాలో నివాసం ఉంటున్న నేపథ్యంలో ఆమెకు ఫ్లైట్ టికెట్లు దొరకకపోవడంతో ఆమె వెంటనే రాలేకపోయారు. ఆమె వచ్చిన తర్వాత బుధవారం నాడు ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. అయితే బుధవారం నాటికి కూడా ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకోలేకపోయారు.


అయితే ఈరోజు ఉదయం తన భార్యతో కలిసి హైదరాబాద్ చేరుకున్న తారక్ నేరుగా తన అన్న కళ్యాణ్ రామ్ ని తీసుకుని తన మేనత్త ఉమామహేశ్వరి నివాసానికి వెళ్లి అక్కడ తన మరదళ్లు విశాలా, దీక్షిత ఇద్దరినీ ఓదార్చారు. అలాగే తన మామయ్య కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్ కి కూడా ఎన్టీఆర్ ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ తన అత్త నివాసానికి వెళ్లి వస్తున్న విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ వారికి ధైర్యం చెబుతూనే తాను కూడా ఎమోషనల్ అయ్యారని, ఉద్వేగానికి గురై కన్నీరు కూడా పెట్టుకున్నారని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.


అయినా సరే వెంటనే ధైర్యం తెచ్చుకుని మేమందరం ఉన్నామని మీరు అధైర్య పడవద్దని ఆమె కుమార్తెలకు అభయం ఇచ్చాడని తెలుస్తోంది. ఇక తన అత్త మరణం గురించి రకరకాలుగా ప్రచారాలు చేస్తున్న వారి పైన కూడా తారక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మనిషి చావులో కూడా ఇలా రాజకీయాలు చేస్తారా అంటూ ఆయన కుటుంబ సభ్యుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 


Also Read: Manchu Vishnu: వారినే సినిమాల్లోకి తీసుకోండి.. నిర్మాతలకు మంచు విష్ణు విన్నపం!


Also Read: Dil Raju on Movie shootings: షూటింగ్స్ మేమే ఆపాము, కానీ పిచ్చి రాతలు రాస్తున్నారు.. అసలు ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook