Dil Raju on Movie shootings: షూటింగ్స్ మేమే ఆపాము, కానీ పిచ్చి రాతలు రాస్తున్నారు.. అసలు ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే?

Dil Raju Clarity on Telugu Movie Shootings Bundh: తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్న క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ తో కలిసి దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2022, 05:34 PM IST
Dil Raju on Movie shootings: షూటింగ్స్ మేమే ఆపాము, కానీ పిచ్చి రాతలు రాస్తున్నారు.. అసలు ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే?

Dil Raju Clarity on Telugu Movie Shootings Bundh: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ మీటింగ్ తరువాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమా నిర్మాతలుగా మేము షూటింగ్స్ ను ఆపామని దానిపై ఇంకో మాట లేదని అన్నారు. మేము 4 పాయింట్స్ పై చర్చిస్తున్నామని అందులో మొదటిది ఓటీటీకి ఎన్ని వారాలకు వెళితే ఇండస్ట్రీకి మంచిది అని ఈ విషయంలో ఒక కమిటీ వేసుకున్నామని, ఆ కమిటీ ఓటీటీకి సంబంధించి వర్క్ చేస్తుందని అన్నారు.

ఇక రెండవ పాయింట్ థియేటర్స్ లో విపిఎఫ్ ఛార్జీలు పర్సెంటెజ్ లు ఎలా ఉండాలి అనే దానిపై ఒక కమిటీ వేసామని, ఇప్పుడు ఆ కమిటీ ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతుందని వెల్లడించారు. అలాగే ఇక మూడవది ఫెడరేషన్ సభ్యల వేతనం సహా వర్కింగ్ కండిషన్స్ పై కూడా కమిటీ వేశామని పేర్కొన్నారు. ఇక నాలుగో పాయింట్ నిర్మాతలకు ప్రొడక్షన్ లో వేస్టేజ్, వర్కింగ్ కండిషన్స్, షూటింగ్ నంబర్ ఆఫ్ అవర్స్ జరగాలి అంటే ఏమి చెయ్యాలి దీనికి కూడా కమిటీ వేశామని పేర్కొన్నారు.

అయితే మేము దీని కోసం షూటింగ్స్ నిలిపివేస్తే సోషల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారని, కానీ మా అందరికీ ఫిలిం ఛాంబర్ ఫైనల్ అని దిల్ రాజు పేర్కొన్నారు. అసలు మాకు నెలలు తరబడి షూటింగ్స్ ఆపాలని ఉద్దేశ్యం లేదని, నిర్మాతకు భారం కాకూడదనేదే మా ఉద్దేశం అని అన్నారు. చివరి మూడు రోజులనుంచి మూడు నాలుగు మీటింగ్స్ అయ్యాయని, అలాగే ఈ నాలుగు కమిటీలు చాలా హోమ్ వర్క్ చేస్తున్నాయని అన్నారు. ఇక త్వరలో ఆ రిజల్ట్ వస్తుందని దిల్ రాజు పేర్కొన్నారు.

చిత్ర పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్సే సుప్రీమ్ అని పేర్కొన్న దిల్ రాజు తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే డెసిషన్ మేకర్ అని మాలో మాకు ఎలాంటి  గొడవలు లేవని అన్నారు. ఇక నుంచి అప్డేట్ అయినా  ఫిలిం ఛాంబర్,  ప్రొడ్యూసర్  కౌన్సిల్ ద్వారానే వస్తుందని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని సినిమాల షూటింగ్స్ ఆగాయని, త్వరలోనే సమస్యలను పరిష్కరించి , షూటింగ్ లు మొదలు పెడతామని అన్నారు.  

Read Also: Rakul Preet Singh: రెడ్ డ్రెస్ లో అందాల విందు.. ఎద అందాలు ఆరబోస్తున్న రకుల్ ప్రీత్

Read Also: Ram Gopal Varma: నేటి టాలీవుడ్ దుస్థితికి రాజమౌళే కారణం.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News