NTR - Devara: ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాలను కూడా అదే లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు. అందుకే రాజమౌళి సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాను పక్కనపెట్టి.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కథా రీత్యా స్పాన్ ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ‘దేవర పార్ట్ -1’ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను నుంచి విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన రెండో పాటకు అంతకు మించిన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.  ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాట తాజాగా ఈ సినిమా మొదటి రోజులోనే అత్యధిక వ్యూస్ తో పాటు లైక్స్ ను సొంతం చేసుకున్న తెలుగు పాటగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ఈ సినిమాలోని పాట ఇంకెన్ని రికార్డులకు పాతర వేస్తుందో చూడాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమాలోని పాట వారం రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అప్పట్లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఊ అంటావా’ పాట 8 రోజుల్లో అందుకోగా.. దేవర పాట వారం రోజుల్లోనే బ్రేక్ చేయడం విశేషం. ఈ సినిమాలోని పాట అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.


ఈ సినిమాకు సంబంధించిన కొంత పార్ట్ మాత్రమే మిగిలివుంది. మరోవైపు ఈ సినిమా సెకండ్ పార్ట్ వచ్చే యేడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అటు ఎన్టీఆర్ హీరోగా హృతిక్ రోషన్ తో చేస్తోన్న ‘వార్ 2’ కూడా సెట్స్ పై వుంది.నవంబర్ వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అవుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.


‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్.. మరోసారి మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో  ఎన్టీఆర్.. తండ్రి ఇద్దరు కుమారులుగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమైన క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
'దేవర'లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తే . 'జై లవకుశ' తర్వాత ఎన్టీఆర్ త్రిపుల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న చిత్రం ఇదే అవుతోంది.


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter