Kadambari Kiran: 'మనంసైతం' అనే ఆర్గనైజేషన్ మొదలుపెట్టి దాదాపు పది సంవత్సరాల నుంచి ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్‌. కాగా ఆయనకు ఇప్పుడు ఒక అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆయన సేవలకు గాను రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందజేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైద‌రాబాద్ లోని ఎఫ్ఎన్‌సీసీలో ఘనంగా జరిగిన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వేడుక‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఈ అవార్డును కాదంబ‌రి కిర‌ణ్‌కు అందజేశారు. అనంతరం ఆయనకి సత్కారం కూడా చేశారు రోటరీ క్లబ్ యూనిట్ సభ్యులు. కాదంబ‌రి కిర‌ణ్ ఎంతోమందికి చేస్తున్న సేవలు అంద‌రికీ ఆద‌ర్శ‌మ‌ని.. ఆయన పేద‌ల పాలిట దేవుడని చెప్పుకొచ్చారు శ్రీ బుర్ర వెంకటేశం. 


అనంతరం రోట‌రీ క్ల‌బ్ ఈస్ట్ జోన్ నిర్వ‌హ‌కులు  టి ఎన్ ఎం చౌద‌రీ మాట్లాడుతూ.. కాదంబ‌రి కిర‌ణ్ దాదాపు పది సంవత్సరాలుగా చేస్తున్న సేవ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. సినీ రంగం నుంచి జయసుధ..సేవ‌రంగం నుంచి కాదంబ‌రి కిర‌ణ్‌, సంగీతం రంగం నుంచి విజిల్ రమణారెడ్డి కి అవార్డులు అందించారు రోటరీ క్లబ్.


ఈ నేపథ్యంలో మనం సైతం ద్వారా కాదంబ‌రి కిర‌ణ్ చేస్తున్న సేవ కార్య‌క్ర‌మాల‌ను వీడియో రూపంలో అక్కడున్న ప్రేక్షకులకు చూపించారు. అనంతరం అవార్డు అందుకున్న ఆనందంతో కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ''ఐశ్వర్యం అంటే మనిషి కి సాటి మనిషి ఉండటం అని నేను నమ్ముతాను. ఇతర జీవులు తమ తోటి జీవులకు సాయపడుతాయి. కానీ మ‌నిషి మాత్రం ఎందుకు తన లైఫ్ మొత్తం తన వారసులు మాత్ర‌మే తన సంపాదన అనుభవించా లని ఆరాట‌ప‌డుతాడు. కానీ మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకోకపోతే మాన‌వ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. కరోనా సమయంలో మేము దాదాపు 50 వేల మందికి పైగా నిస్సాహ‌యుల‌కు సాయం చేశాం. పేదల‌కు సేవ చేస్తే చిన్నపిల్లల కాళ్ళు అయినా మొక్కుతా.. లేదంటే పరమ శివుడినైనా ఎదురిస్తా'' అని ఎంతో ఎమోషనల్ గా తన స్పీచ్ ముగించారు కాదాంబరి కిరణ్.


Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!


Read More: Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook