Prabhas Kalki Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకి వస్తున్న సినిమా కల్కి 2898 AD. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మేలో విడుదల అయ్యుండేది. కానీ నిర్మాణాంతర పనులతో బాగా ఆలస్యం అయిపోవడం మరోవైపు ఎన్నికలు రావడంతో పాటు ఐపీఎల్ హడావిడి కూడా ఎక్కువగానే ఉండటంతో సినిమా విడుదల ను చిత్ర బృందం వాయిదా వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సినిమా మేలో విడుదల అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ కొత్త రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చిత్ర బృందం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ సినిమా యూనిట్ మాత్రం కచ్చితంగా ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేకపోతోంది. దానికి ఒకటి కాదు పలు కారణాలు ఉన్నాయి. ఒకవైపు బయర్లు ఒక డేట్ చెప్తుంటే ఇప్పటికే డిజిటల్ రైట్స్ తీసేసుకున్న వారు మరొక డేట్ ని సజెస్ట్ చేస్తున్నారు. 


అంతేకాకుండా సినిమా యూనిట్ లో కూడా డేట్ విషయంలో అందరూ ఒక మాట మీదకి రాలేకపోతున్నారట. అన్ని రకాల అంశాలను పరిశీలించాక సినిమాని జూన్ 27న విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మూవీ యూనిట్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయింది. కానీ విదేశాల నుంచి రావాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. అది కూడా పూర్తయితే నిర్మాణాంతర పనులు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. జూన్ రెండవ వారం కల్లా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది.


సైన్స్ ఫిక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. 


దిశా పఠాని, మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.


Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి


Also Read: Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter