కంగనా రనౌత్ ( Kangana ranaut ) . పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కుండబద్దలు కొట్టినట్టు వ్యాఖ్యలు చేస్తూ కొన్నిసార్లు వివాదాస్పదమై...మరికొన్ని సార్లు ప్రశంసలు కురిపించుకుంటుంది. ఇప్పుడు మరోసారి పెద్ద స్టార్ లపై షాకింగ్ కామెంట్స్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ హీరోయిన్ ( Bollywood Heroin ) కంగనా రనౌత్ ( Kangana ranaut ) వ్యాఖ్యలు మరోసారి సంచలనమవుతున్నాయి. వివాదాస్పదమవుతున్నాయి. యువ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Sushant singh rajput suicide ) ఆత్మహత్యానంతరం ఆమె చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ మాఫియాపై పెద్దఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. నెపోటిజంపై ( Nepotism ) ఈమె చేసిన వ్యాఖ్యలతో...టాలెంటెడ్ యాక్టర్స్ జీవితాలు గుగ్గిపాలవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ మధ్య వివాదాలు రేగుతున్నాయి. ఇప్పటికే కరణ్ జోహార్ ( karan johar ), తాప్సి ( Tapsi ) లపై విరుచుకుపడిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పుడు మళ్లీ వివాదాస్పదమైంది.


ఇప్పుడీసారి స్టార్ హీరో హీరోయిన్లైన రణబీర్ కపూర్ ( ranbir kapoor ), దీపికా పదుకొనే ( Dipika padukone )లను టార్గెట్ చేసింది. హీరో రణబీర్ కపూర్ స్త్రీ లోలుడని..దీపిక మానసిక వ్యాధి గ్రస్తురాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగలేదు.  నిత్యం అమ్మాయిల  వెంటపడే రణబీర్ ను ఎవ్వరూ రేపిస్ట్ అని పిలిచే ధైర్యం చేయరని వ్యాఖ్యానించింది. మానసిక వ్యాధిగ్రస్థురాలిగా ప్రకటించుకున్న దీపికా పదుకొనేను ఎవ్వరూ సైకో, రాక్షసి అని పిలవరు. అయితే సాధారణ కుటుంబాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చేవారికి మాత్రం పేర్లు పెడుతూ హింసిస్తుంటారు. Also read: Prabhas Fees: రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ ఇండియాలోనే టాప్?