Prabhas Fees: రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ ఇండియాలోనే టాప్?

బాహుబలి సిరీస్ ( Baahubali ), సాహో ( Saaho ) తరువాత ప్రభాస్ భారత దేశంలో టాప్ నటుల్లో ఒకరిగా మారాడు. తాజా సమాచార ప్రకారం ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న ప్రభాస్ ( Prabhas ) తన నెక్ట్స్ సినిమా కోసం రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Last Updated : Aug 11, 2020, 10:49 PM IST
Prabhas Fees: రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ ఇండియాలోనే టాప్?

బాహుబలి సిరీస్ ( Baahubali ), సాహో ( Saaho ) తరువాత ప్రభాస్ భారత దేశంలో టాప్ నటుల్లో ఒకరిగా మారాడు. తాజా సమాచార ప్రకారం ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న ప్రభాస్ ( Prabhas ) తన నెక్ట్స్ సినిమా కోసం రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) తెరకెక్కించనున్న ఆ సినిమా కోసం ప్రభాస్ ఈ మేరకు చార్జ్ చేస్తున్నట్టు సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె ( Deepika Padukone ) హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది అని సమాచారం.

 

ప్రభాస్ ఈ చిత్రానికి రూ.70 కోట్లు పారితోషికం తీసుకోగా.. రూ.30 కోట్లు డబ్బింగ్ రైట్స్ చార్జ్ తీసుకోనున్నట్టు సమాచారం. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ చిత్రానికి ఏకంగా  రూ.70 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్ ను ప్రభాస్ దాటివేశారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ అనే రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ, మురళీ శర్య, ప్రిదయర్శి పులికొండ తదితరులు నటిస్తున్నారు.

 

Trending News