Karthika Deepam 2: నువ్వే పెద్ద దరిద్రం అని పారుపై విరుచుకుపడ్డ కార్తీక్.. దీపను చూడటానికి బయలుదేరిన సుమిత్రమ్మ..
Karthika Deepam 2 January 4 Episode: దీప గాద చెప్పిన పారిజాతం. అప్పుడు నేను దీపను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కష్టాలు. పౌరుషంతో నేనే తన చెయి పట్టుకుని బయటకు వచ్చా. అసలైన దరిద్రానివి నువ్వే అని పారును వేసుకుంటాడు కార్తీక్. జ్యోత్స్నను పెళ్లి చేసుకోను అని అందరి కంటే ముందు నీకే చెప్పాను అంటాడు.
Karthika Deepam 2 January 4 Episode: మనుషులు కలవాలని లేనప్పుడు తీసుకునే నిర్ణయం ఏముంటుంది. మాకు ముందే రాసిపెట్టి ఉంది అందుకే కలిశాం. దీప దురదృష్టం కాదు నా అదృష్ట దేవత. పది మంది మంచి కోరే మనిషి అంటాడు. అనుకోరా అనుకో చూసే జనాలకు మాత్రం దీప అలా కనిపించడం లేదు. నా దగ్గరకు వచ్చి కార్తీక్ బాబు తాళికట్టాడు అంటది. జ్యోత్స్న దగ్గరకు వెళ్లి నాభర్త జోలికి వస్తే చంపుతా అంటుంది. అందుకే దీప చేసే దరిద్రాన్ని పేపర్లో రాసి ఇంటి గోడకు అంటించాలనుందిరా అంటది పారు.
నీకు ఏం తెలుసు దీప గురించి పదేళ్ల వయస్సు నుంచే కష్టపడుతుంది. ఇష్టం లేకపోయిన తండ్రి కోసం తలవంచి తాళికట్టించుకుంది. భర్త మొగుడు మోసం చేసినా బిడ్డను కాపాడుకుంటూ పనిచేసికుని బతుకుతుంది. అనసూయను ఆదుకున్న దీప ఎక్కడ? తాతను రెచ్చగొట్టి నన్ను ఆ ఇల్లు వదిలి వచ్చేలా చేసింది. జ్యోత్స్నది తెంపుకుపోయేతత్వం, దీపది కలిసిపోయే తత్వం. జ్యోత్స్నది అధికారం, దీపది ఆదరణ. జీవితాన్ని త్యాగం చేయాలంటే అది దీప అయి ఉండాలి. దీపను అర్థం చేసుకోవాలంటే ముందు నీకు మనసు ఉండాలి.పారూ..నీకే చెప్పేది, చేసిన తప్పులు రాస్త అంటే ఊరుకునేది లేదు. నాజీవితంలో దీప విలన్ కాదు కథానాయిక. ఇప్పుడు నీకు అర్థం కాదు గెలిచిన తర్వాత అర్థం అవుతుంది. పదా దీప అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కార్తీక్ గాడేంటి ఇంత వైలంట్‌గా మారాడు అనుకుంటుంది.మరోవైపు కాశీ దాసుకు కాఫీ ఇస్తాడు. నాన్న మనం ఇద్దరమే ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు నలుగురు అయ్యారు కానీ దూరం పెరిగింది. నువ్వు ఎవరి గురించో వెతికావు కదా దొరికాడా? అంటాడు నేను అన్వేషించింది ఓ నిజాన్ని నా నోటితో చెప్పకూడదు అంటాడు స్వప్న ఏంటి మామయ్య అంటుంది. విడిపోయిన వారిని కలిపేది ఆ దేవుడే అని పనుంది అని వెళ్లిపోతాడు. మావయ్యగారిని ఇలా వదిలేయకూడదు అంటుంది దిల్లు చిన్నప్పటి నుంచే ఇలా ఉన్నాడు అంటాడు. మొత్తానికే ఏదో దాస్తున్నాడు అంటాడు.
కాశీ అన్నయ్య వదిన గురించి మనం ఆలోచించాలి అంటుంది. అవును ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అంటాడు కాశి. ఇక శివన్నారాయణకు ఆఫీసులో ఎంప్లాయీస్‌కు శాలరీ ఇవ్వడం కష్టంగా ఉంది తాత అంటుంది జో. నువ్వు ప్రాఫిట్స్ పెంచు బడ్జెట్ తగ్గించు కంపెనీకి ఏది మంచిదో నీకు తెలుసు కదా అంటాడు. థ్యాంక్యు తాతా అనివెళ్లిపోతుంది. కంపెనీ వ్యవహరాలు మొత్తం జో మీద వదిలియేడం సరికాదు నాన్న అంటాడు దశరథ. పనిలో పడితే కార్తీక్ గాడిని మరిచిపోతుందిలే అంటాడు శివన్నారాయణ.తొందరలోనే నా మనవరాలు నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది అంటాడు .
ఇదీ చదవండి: ప్రకాశంకు నచ్చని కావ్య తీరు.. ఇరకాటంలో సుభాష్, ఈసారి కిరీటానికే అనామిక ఎసరు..
ఇక స్కూలుకు టైమ్ అవుతుంది నన్ను ఎవరు తీసుకెళ్తారు అని మారం చేస్తుంది శౌర్య. వస్తారు ఆగు అంటుంది కాంచన అప్పుడే దీప కార్తీక్‌లు మార్కెట్ నుంచి వస్తారు. అమ్మానాన్న వచ్చారు అంటుంది. ఏమే రౌడీ రెడీ అయిపోయావా? అంటాడు కార్తీక్. ఏం దీప ఇంత లేట్ అయింది కాంచన అంటుంది. దారిలో తెలిసిన వారు కనిపించారుఅమ్మ అంటుంది దీప.
రౌడీపదా అంటాడు కార్తీక్ నేను తీసుకువెళ్తా అంటుంది. లేదు బాబు శౌర్యను బస్సులో తీసుకెళ్లాలి అంటాడు. ఆఫీసులో పనిచేసే కోటీ సెకండ్ హ్యాండ్ సైకిల్ పంపించాడు. దీనిపై రౌడీని తీసుకుని వెళ్తారు. సైకిల్‌పై హాయిగా తొక్కుకుంటూ వెళ్దాం పదా అంటాడు. అమ్మకు బై చెప్పు అంటాడు. చూడు ఎంత బాగుంది సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిది రయ్ రయ్ ని వెళ్దాం అని వెళ్లిపోతారు. దీప ఏడుస్తుంది కారులో తిరిగే కార్తీక్ బాబు ఇలా సైకిల్‌పై తిరగాల్సి వచ్చింది అంతా నావళ్లే కదా అంటుంది దీప.
శివన్నారాయణ హాల్‌లో ఉంటాడు. సుమిత్ర అబద్దం చెప్పి ప్రతిసారి బయటకు వెళ్లినప్పుడు దొరికిపోవాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటుంది. కానీ, తప్పడం లేదు నన్న క్షమించండి అనుకుని వెళ్తుంది. మావయ్య గారు గుడికి వెళ్తా అంటుంది. డ్రైవర్ వస్తాడు అంటాడు నడుచుకుంటూ వెళ్తా అంటుంది. నేను వస్తా ఆు అంటుంది పారు కార్తీక్‌తో జరిగిన విషయం శివన్నారాయణ గురించి చెబుతుంది. ఈ శివన్నారాయణ పరువు నిలబెట్టడానికి నా మనవరాలు ఉంటుంది చాలు అంటాడు
అప్పుడే దాసు వస్తాడు.నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న అర్థంకాదా అంటుంది జో. ఇప్పుడు నేనే ఏ తప్పు చేయలేదే అంటుంది జో. నువ్వు మాట మీద నిలబడవు నాన్న అంటుంది జో నాకు అదే అనిపిస్తుంది అంటాడు దాసు. నిజం చెబితే దీప ఈ ఇంటికి వస్తుంది నేనునా కన్న తల్లి దగ్గరకు వెళ్తాను.ఒక పుట్టుక,ఒక చావు, ఒక బతుకు అంటావు కదా. నువ్వు ఒక పుట్టుక గురించి చెప్పకుంటే అంటే దీప, ఒక చావు ఉండదు అంటే నాది, అప్పుడు ఒక బతుకు ఉంటుంది అది కూడా నాదేఅంటుంది జో. అప్పుడే సుమిత్ర వస్తుంది ఎందుకు పోవాలి.పెద్దవాళ్లకు ఏవో పంతాలు ఉన్నాయని పిల్లలు పట్టుకోకూడదు అంటుంది. సారీ మమ్మి తాతయ్య ఇంట్లో ఉన్నాడు కదా బాధపడతాడు అంటుంది. నువ్వు ఇలా మాట్లాడితే ఎంతో ఆనందంగా ఉంది అంటుంది సుమిత్ర.
ఇదీ చదవండి: రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో జబర్దస్త్ బ్యూటీ.. అడ్డంగా బుక్కైన రీతూ చౌదరీ..?
దాసు జో నిన్ను ఏమైనా అందా అంటుంది సుమిత్ర. లేదు వదిన సార్ ఉన్నారని చెబుతుంది. కార్తీక్‌దీప విషయంలో జో చేసే పనులు నాకు కోపంగా ఉంది కూతురు కదా అంటుంది. గుడికి వెళ్తున్నారు కదా వెళ్లండి వదిన అంటాడు. నాకు వదినని, చంటిదాన్ని దీపను చూడాలి అనిపిస్తుంది. ఒక్కసారి తీసుకెళ్తావా అంటుంది రండి వదిన దీపపై తల్లిలాంటి నీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి రండి వదిన అని దాసు తీసుకువెళ్తాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook