Brahmamudi: ప్రకాశంకు నచ్చని కావ్య తీరు.. ఇరకాటంలో సుభాష్‌, ఈసారి కిరీటానికే అనామిక ఎసరు..

Brahmamudi Today January 4 Episode: కావ్యరజ్‌లు ఇంటి వస్తారు. ఇక ఒక్కసారిగా విరుచుకుపడతారు ధాన్య,రుద్రాణీలు. నువ్వు మహరాణీలా తిరిగితే మాకు కార్ల సంగతి ఏంటి అంటారు. ఎవరిని అడగాలి? మా ఆయన నా పక్కనే ఉన్నారు. ఆయనకు తెలిసే చేశాను అంటుంది కావ్య.
 

1 /9

ఏంటి? ఒకే రకం టిఫిన్‌ చేయమని, భోజనం చేయమని ఖర్చులు, కార్లు తగ్గించమని మా నాన్న రాసిచ్చాడా? అంటుంది రుద్రాణీ. మీరు లక్షలు లక్షలు ఖర్చు పెడితే చూస్తూ ఊరుకోమంటారా? ఆస్తి మొత్తం పుట్టింటికి తరలించి అత్తింటిని మోసం చేశారు అంటారు. ఆస్తి బాధ్యత తాతయ్య నాకు ఇచ్చారు. నువ్వు చేసిన రూల్స్‌ వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు పట్టవా అంటుంది రుద్రాణీ. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని ఆర్డర్‌ వేసి వెళ్తుంది కావ్య.  

2 /9

అన్నయ్య కావ్య మాట్లాడిన పద్దతి మాత్రం నాకు నచ్చలేదు అన్నయ్య అని ప్రకాశం కూడా సుభాష్‌తో చెప్పి వెళ్లిపోతాడు. బెడ్ రూమ్‌లో రాజ్‌ బాధపడుతుంటాడు. ఈ బంధాలు ఏమైపోతాయో అనిపిస్తుంది. కుటుంబాన్ని ఒక్కరిగా ఉంచడానికి తాతయ్య ప్రయత్నం ఏమవుతుందో అంటాడు రాజ్‌. ఈ ఇంటికి జబ్బు సోకిందండి, ఇదే మందు. అటు ఇటు నడిచే మందను ఒకేవరుసలో నిలబెట్టే ప్రయత్నం. వారందరీ గొంతెమ్మ కోరికను నెరవేర్చలేము. ఇంకా అప్పుల్లో కూరుకుపోయేకంటే ఇలా చేయడం నయం. ఆకాశంలో విహరించే వారంతా నేల మీద నడుస్తారు అంటుంది కావ్య. కానీ, నువ్వు కుటుంబానికి దూరం అవుతావు అంటాడు రాజ్‌. మీకు నిజం తెలుసుకదా నాకు అదిచాలు.  

3 /9

ఆస్తులు అన్ని అమ్మాల్సిన పరిస్థితి ఉంది అంటే జీర్ణించుకోలేరు అంటుంది. అప్పటి వరకు ఈ నిజం బయటకు రాకుండా ఉంటుంది అంటాడు రాజ్‌. తెలీదు మంచి చేయడమే తెలుసు ఇప్పుడు ఆలోచించడం వారి గురించి కాదు కాదు,అప్పు గురించి అంటుంది కావ్య. ఇక అమ్మమ్మ కూడా కావ్య తీసుకున్న నిర్ణయం వల్ల ఇంట్లోవారు ఇబ్బంది పడుతున్నారు. కావ్య సక్రమంగా నిర్వహిస్తోందో లేదో తెలీదు అంటుంది ఇందిరాదేవి. తను చేస్తుంది కరెక్ట అమ్మ అంటాడు సుభాష్. కానీ, కార్లు, ఫుడ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశానికి కూడా ఇప్పుడు కావ్య తీసుకున్న నిర్ణయం నచ్చడం లేదు.   

4 /9

అసలేఎప్పుడు దొరుకుతుందా అని ఆ రుద్రాణీ, ధాన్యలక్ష్మిలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో సుభాష్‌ కూడా మారితే కష్టం అంటాడు సుభాష్‌. ఎంత మంచి వాడైన తన మనస్సు గాయపడితేవారి మనసు బాధపడుతుంది. ఒకవేళ అదే జరిగితే విడిపోవడం ఖాయం అంటుంది ఇందిరాదేవి. ఇప్పుడు కావ్యను పద్దతి మార్చుకో ఇంట్లో వారికి నచ్చట్లేదు అని చెప్పాలి అంటాడు సుభాష్‌, అలా అని ఇలా వదిలేయలేం కదా అంటాడు. ఇక ఇందిరా దేవి సుభాష్‌, అపర్ణలను రాజ్‌ కావ్యలతో ఈ విషయమై మాట్లాడమని చెబుతుంది.  

5 /9

మరోవైపు అనామిక నందగోపాల్‌ చెంప చెల్లుమనిపిస్తుంది. మూడు నెలలు ఆజ్ఞాతంలో ఉండమంటే అక్కడ కూడా నీకు గర్ల్‌ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా? చెప్పిన పని కూడా చేయలేని చవట అంటుంది. అనామక కూల్‌ అంటాడు సామంత్‌. చెప్పిన పని చేయకపోతే నేనే పోలీసులకు ఫిర్యాదు చేస్తా అంటుంది. అలా జరిగితే ఈసారి ప్రాణాలతో ఉండవు అని వార్నింగ్‌ ఇస్తుంది.  

6 /9

ఈ ఇన్సిడెంట్‌తో ఆ రాజ్‌ ఇంకా జాగ్రత్త పడతాడు, ఎలాగైనా కంపెనీని కాపాడుకుంటాడు. ఆ కావ్య వేసిన డిజైన్స్‌ నాకు కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలీదు, ఎత్తుకు పై ఎత్తు వేస్తా అంటుంది సామంత్‌తో అనామిక. అలాగే అని వెళ్తాడు సామంత్‌. ఇక బెడ్‌రూమ్‌లో రాజ్‌ కావ్యలు డిజైన్స్‌ మార్చి ఎందుకు చేశారు అవన్నీ రీసైకిల్‌ చేసి మార్చండి అని ఫోన్‌ మాట్లాడతాడు.  

7 /9

రాత్రంతా కావ్య, రాజ్‌లు డిజైన్స్‌ వేస్తూ ఆఫీస్‌ వర్క్‌ చేస్తుంటారు. రాజ్‌ కావ్యకు కాఫీ తెచ్చి ఇస్తాడు. కావ్య డిజైన్స్‌ వేస్తూ ఉంటుంది వింటూ రాజ్‌ కావ్య భుజంపై వాలిపోయి నిద్రపోతాడు కాసేపటికి కావ్య కూడా నిద్రపోతుంది. ఇద్దరూ పడుకుంటారు.   

8 /9

ఉదయం రాజ్‌ కావ్యను ఒంటరిగా ఆఫీసు వెళ్లమంటాడు అర్జంటుగా మెయిల్‌ పెట్టాలి అంటాడు. దీంతో కావ్య అపర్ణ ఆగమని చెప్పినా వినకుండా వెళ్లిపోతుంది. వెనకే రాజ్‌ కూడా వెళ్లిపోతాడు ఈరోజు ఆర్నమెంట్స్‌ వస్తాయి వాటిని చూసి ఫైనల్‌ చేయాలి అని చెప్పి వెల్లిపోతాడు. ఆఫీసులో రాజ్‌ కావ్యలు వాటిని చెక్‌ చేస్తూ ఉంటారు. రాజ్‌ దొరికాడా ? వాన్ని ప్లీజ్‌ పట్టుకో అని కాల్‌ చేస్తాడు.   

9 /9

చీకటి పడుతుంది. మళ్లి అందరూ డైనింగ్‌ టేబుల్‌ వద్ద తింటూ ఉంటారు కావ్య రాజ్‌లు వస్తారు. అమ్మ కావ్య త్వరగా ఫ్రెష్‌ అయి రా.. అంటుంది. మీరు తినండి మమ్మి మధ్యాహ్నం తినడానికి సమయంలేదు 5 గంటలకు తిన్నాం అంటాడు. ఇక అనామిక మరో ఎత్తుగడ వేస్తుంది రాజ్‌ ఆఫీస్‌ సెక్యూరిటీతో మళ్లీ కుతంత్రాలు చేయడం ప్రారంభిస్తుంది.+