Karthika Deepam 2 Today December 28 Episode:  దీప ఇలా ఇంటికి సరుకులు తీసుకువచ్చిన వారిని ఎంతో కొంత ఇవ్వాలి. కబోర్డులో డబ్బులు ఉంటాయి  అందులో రూ.50 ఉంటాయి అతనికి ఇవ్వు అంటుంది ఓనర్‌. వెంటనే డబ్బు తెచ్చి ఏడుస్తూ కార్తీక్‌ చేతిలో పెడుతుంది దీప. నువ్వు కొత్తగా పనిలో చేరావు కదా.. తీసుకో.. అంటుంది మేడమ్. నో థ్యాంక్స్‌ అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్‌. హా.. చేసేది సూపర్‌ మార్కెట్‌లో పని అయినా కోటీశ్వరునిలా పౌరుషం అంటుంది మేడమ్‌. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూమ్‌లో ఏదో ఆలోచిస్తు ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న ఆనందంగా గ్రానీ అని పారిజాతం వద్దకు వస్తుంది. నా గదిలో నువ్వేం చేస్తున్నావ్‌ అంటుంది. నువ్వు నీ బావ కోసం వెళ్లావేమో అని మీ అమ్మ అనుకుంటుంది. స్థాయి మారింది కానీ వారి మాట తీరు మారలేదు. ఆ పొగరుబోతు దీప ఏం చేస్తుంది? గట్టిగా ఇవ్వాల్సింది అంటుంది పారిజాతం. దీప సంగతి తెలియదా? వీక్ పాయింట్ చూసి కొట్టాలి అంటుంది జ్యోత్స్న. బావకు ఎక్కడా జాబ్‌ రాకుండా చేశా అంటుంది జో. నాలుగైదు రెస్టారెంట్లు తిరిగాడు నా ఇన్‌ఫ్లుయెన్స్‌తో చెడగొట్టా. ఎక్కడా జాబ్‌ దొరక్కపోతే ఇంటికి వస్తాడు అనుకున్నావా అంటుంది పారిజాతం. అది వచ్చే వరకు ట్రై చేయాలి. వెయిట్‌ చేయాలి అంటుంది జో. దీప ఏం చేస్తుంది మనం తెలుసుకోవాలి. మొగుడికి ఉద్యోగం లేదని మూలకు కూర్చొని ఏడ్చేరకం కాదు అంటుంది పారిజాతం.


ఇక ఇంట్లో సాయంత్రం అయింది దీప, కార్తీక్‌లు ఇంకా రాలేదు అని కాంచన కంగారుపడుతుంది. అప్పుడే దీప, కార్తీక్‌లు ఒకేసమయంలో ఇంటికి చేరుకుంటారు. ఏరా కార్తీక్‌ ఏమైంది? ఉద్యోగం ఇచ్చాడా అంటుంది. ఆ మహానుభావుడు ఎవరో కాదు అమ్మ పిలిస్తే వరుసకు నాన్న అవుతాడు పేరు శ్రీధర్. ఇంటికి వచ్చి అవమానం చేసింది సరిపోలేదు. ఆఫీస్‌కు పిలిచి అవమానించాడు నేను తప్ప ఎవరి దిక్కులేదు అన్నాడు. వదిలేయ్‌ అమ్మ ఏదో ఓ దారి అదే దొరుకుతుంది అంటాడు. దీప నీతో మాట్లాడాలి ఓసారి లోపలికి రా అంటాడు కార్తీక్‌.


ఆ ఇంట్లో నువ్వు వంటమనిషిగా చేయాల్సిన అవసరం ఏంటి అంటాడు. నువ్వు సూపర్‌ మార్కెట్లో చేరడం ఏంటి అంటాడు. ఇంటి ఖర్చులకు డబ్బు కావాలి. చదువుకున్న ఉద్యోగం కావాలి అంటే పస్తులు ఉండాల్సిందే అంటాడు. మీరు రేపటి నుంచి ఆ పనికి వెళ్లకండి అంటుంది దీప. సరే నేను వెళ్లను, నువ్వు వెళ్లకు ఇద్దరం కలిసి ఏం చేద్దాం అంటాడు. ఈ విషయం అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడాలి అని వెళతాడు. 


ఇదీ చదవండి:  కార్ల వ్యవహారం అడుక్కుతినడానికి కూడా పనికిరాని కావ్య.. జస్ట్‌ మిస్‌, అసలు విషయం తెలుసుకున్న సుభాష్‌..  


ఇక కార్తీక్‌ ఇంటికి దాసు, కాశీ, స్వప్నలు చేరుకుంటారు. ఉద్యోగం దొరకలేదన్న విషయం తెలుస్తుంది. మా నాన్న వల్లే ఇలా జరిగింది అని కాంచన ఏడుస్తుంది. నేను జాబ్‌ మీద లోన్‌ తీసుకుంటా అంటాడు కాశీ, వద్దంటాడు కార్తీక్‌. అప్పుడు దీప నాదగ్గర ఒక సలహా ఉంది అంటుంది దీప. మనం టిఫిన్‌ సెంటర్‌ ఎందుకు పెట్టకూడదు అంటుంది వద్దు అంటాడు కార్తీక్‌. అలవాటు అయిన పని కదా.. ఖాళీగా ఉంటే ఏం వస్తుంది నేను టిఫిన్‌ సెంటర్‌ పెడతా బాబు అంటుంది. వద్దు అని లేచి వెళ్లిపోతాడు. వాడికి ఇష్టం లేదు అన్నాడు కదా వదిలేయ్‌ అంటుంది కాంచన. లేదు మనం పెడిదాం అంటుంది. బాబాయ్ బండి ఒకటి చూడండి అంటుంది అలాగే ఇంటి ముందు పెట్టు అంటాడు.


ఇదీ చదవండి:  ఇలా జరిగిందేంటి? టెట్‌ అభ్యర్థులకు బిగ్‌షాక్‌.. లాస్ట్‌ ప్రయారిటీనే ఎగ్జామ్‌ సెంటర్‌..  


కాశీని కూరగాయలు తీసుకువద్దాం అంటుంది. ఆయన నాభార్య మర్యాద గురించి చూస్తాడు కార్తీక్‌ బాబు బిజినెస్‌ పెట్టేవరకు నన్ను ఈ టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకుంటా అమ్మ అంటుంది. అందరూ కాంచనను ఒప్పిస్తారు. నేను ఏదో రకంగా బండి చూస్తాను వెంటనే కాశీకి ఫోన్‌ చేస్తా అంటాడు దాసు. కోట్లుకు వారసురాలు ఇడ్లీ బండి పెట్టుకోవడం ఏంటి అని మనసులో అనుకుంటాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.