Karthika Deepam 2: కార్తీక్‌ను గట్టిగా వాటేసుకును బోరున ఏడ్చిన దీప.. దాసు కాళ్లు పట్టుకుని వేడుకుంటున్న జ్యోత్స్న..
Karthika Deepam 2 Today December 31 Episode: టిఫిన్ తిన్న ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకోను. అందుకే మీ డబ్బు వద్దని దీప జో కు డబ్బులు చేతపెడుతుంది. ఇచ్చింది ఇచ్చినట్లు తిరిగి ఇవ్వకూడదు అందుకే ఈ పదకొండురూపాయలు కూడా తీసుకో అని చేతపెడుతుంది. లెక్కసరిపోయింది ఇక వెళ్లు జ్యోత్స్స అంటుంది దీప.
Karthika Deepam 2 Today December 31 Episode: కోపంగా కారు వద్దకు వెళ్లిపోయిన జో, పారిజాతంలు దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని మాట్లాడుకుంటారు. కారు ఎక్కి వెళ్లిపోతారు.తగ్గితే దీప ఎలా అవుతుంది. ఇంకోసారి ఇలా ఎక్ట్స్ చేయదు అంటాడు కార్తీక్. జో, పారులు ఇంటికి చేరుకుంటారు. సుమిత్ర ఎక్కడికి వెళ్లావే అని అడుగుతుంది. మీ మేనల్లుడు ఇంటి పరువు తీస్తే కొంతైనా కాపాడదాం అని వెళ్లా అంటుంది జో. లండన్‌లో చదువుకున్న బావ దీపతో టిఫిన్ సెంటర్ పెట్టాడు చూడు అని శివన్నారాయణకు ఫోటో చూపిస్తుంది జో.
అప్పుడే శివన్నారాయణ దశరథ.. అని పిలుస్తాడు. మీ మేనల్లుడు చాలా టాలెంటెడ్ అన్నావ్ కదా.. చూడు మన సపోర్ట్ లేకపోతే వాడి స్థాయి ఎక్కడ ఉంది అంటాడు. దీప ఉంటే అదే కర్మ అంటుంది జో. కోరి శనిదేవతను నెత్తిన పెట్టుకున్నాడు ఇలాగే జరుగుతుంది. బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అందుకుంటా అన్నాడు. బయటకు వెళితే ఏ శివన్నారాయణ నీ మనవడు టిఫిన్ బండి పెట్టాడట అంటారు ఛీ అని శివన్నారాయణ వెళ్లిపోతాడు.
మీరేందుకు వెళ్లారు అతని వద్దకు, వారిని వెంటపడి వేధిస్తారా? అంటుంది సుమిత్ర. ఇక ఎలాగైనా వారిని వచ్చేయమని చెప్పండి నాన్న అంటుంది జో. వాడి చదువు, తెలివితేటలకు ఇది సరైంది కాదు, ఇంకేదైనా చేసి ఉండాల్సింది అని వెళ్లిపోతాడు దశరథ. కార్తీక్ దీప ఓడిపోయే రకాలు కాదు, వారు ఇప్పుడే తొలి అడుగు వేశాడు. గుర్తు చేస్తే మావయ్య గారి జీవితం కూడా ఇలాగే మొదలయిందట. తాతా బాటలోనే నడుస్తున్నాడు గెలుస్తాడు. వాడి పక్కన భూదేవి లాంటి భార్య ఉంది. తనే గెలిపిస్తుంది మీరేం టెన్షన్ పడకండి అని సుమిత్ర అంటుంది.
మమ్మి ఏంటి ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతుంది వాళ్లని మనం గెలువనీయకూడదు గ్రానీ అంటుంది జో. దీప వాడి పక్కన ఉంటే వాడిది చిల్లర బతుకు ఈ మాట రాసి పెట్టుక అంటుంది పారు. మరోవైపు కార్తీక్, దీపలు డబ్బులు లెక్క పెట్టుకుంటారు. పెట్టుబడి పోను మూడువేల రెండువందలు మిగిలాయి అంటుంది దీప. రేపటి నుంచి మీరు రాకండి మీరెందుకు వచ్చారు. మా బతుకులకు ఇది అలవాటు. ఇది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా. ఇడ్లీ పొట్లాలు కట్టడం నాకు అలవాటే అని ఏడుస్తుంది దీప.
కకానీ, మీది నా జీవితం లాంటిది కాదు ఐశ్వర్యంలో పుట్టారు. దర్జాగా ఏసీ కారులో వెళ్లేవారు. మీరేం మాట్లాడకండి జ్యోత్స్న చెప్పింది నిజమే స్టార్ రెస్టారెంట్ నుంచి టిఫిన్ బండికి తీసుకువచ్చా. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేకుంటే నేను టిఫన్ సెంటర్ పెట్టా ఎందుకంటే నాకు అది తప్ప ఏదీ రాదు. సంవత్సరంలోగా మీ తాతగారికి అవార్డు తీసుకుంటా అని ఛాలెంజ్ చేశారు. నీ బాధ ఏంటి దీప భార్యకు సహాయంగా ఉండటం భర్త బాధ్యత. నా భార్య కష్టపడితే నాకేంటి నా స్థాయి అది కాదు అనివదిలేయాలా? అంటాడు. ఎవరో ఏదోఅనుకుంటరు అని నేను నీ కష్టాన్ని పంచుకోకుండా ఎలా ఉంటాను నీకు నచ్చినా.. నచ్చకపోయినా నువ్వు వేసే ప్రతి అడుగులో నేను ఉంటా అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ బాబు.. అని గట్టిగా వాటేసుకుని ఏడుస్తుంది. కట్ చేస్తే కార్తీక్‌ను వాడేసుకున్నట్లు కల కంటుంది దీప. అప్పుడే శౌర్య వచ్చి ఏంటమ్మ అలా ఉన్నావ్ అంటుంది. నానమ్మ నిన్ను పిలుస్తుంది అని చెబుతుంది.
ఇదీ చదవండి : డ్రైవర్లు కూడా ఛీ కొడుతున్న ధాన్యలక్ష్మి.. మర్డర్ చేసైనా జైలుకు వెళ్లడం బెట్టర్ అంటున్న రుద్రాణీ..
దీప అదనంగా ఇచ్చిన రూ.11 పట్టుకుని ఆలోచిస్తుంది జో. నేను నీ పేదరికాన్ని హేళన చేస్తే నా అహం మీద దెబ్బకొట్టావ్ దీప. నాకూ ఒక రోజూ వస్తుంది. నీకు బతకాలంటే భయం వేసే సమయంలో నేను నిన్ను చంపుతా దీన్ని ఎవరూ ఆపలేరు అంటుంది జో. అప్పుడే గేటు తెరుచుకుని దాసు వస్తాడు. నువ్వేందుకు వచ్చావు నాన్న అంటుంది జో. వదినని కలిసి నీ కూతురు జ్యోత్స్న కాదు..దీప అని చెబుతా అంటాడు. దీపని ఈ ఇంటి వారసురాలిగా చూడాలని ఉందమ్మ అంటాడు. అయ్యో నాన్న అది తప్ప ఇంకేదైనా అడుగు అంటుంది జో. నాకెందుకు లోలోపల నేను పాపం చేస్తున్నట్లు అనిపిస్తుందిఅమ్మ. ఇన్ని కోట్లకు ఏకైక వారసురాలు ఎక్కడో ఎందుకు కష్టపడాలి. కార్తీక్ కూడా ఈ ఇంటి వారసుడే కదా.. అంటాడు దాసు.
దీపని కార్తీక్‌నను డబ్బు ఎంత కావాలో ఇవ్వండి కానీ, నిజం చెప్పొద్దు అంటుంది జో. రెండు కాళ్లు పట్టుకుని బతిమిలాడుతుంది. అప్పుడే పారిజాతం ఇంట్లోనుంచి చూసి ఆశ్చర్యపోతుంది. ఎవరైనా చూస్తారు లేమ్మా అంటాడు. నువ్వు కానీ, లోపలికి వెళితే నేను బయటకు వెళ్తా. నేను సుమిత్ర కూతురిగానే బతికా, అలాగే చచ్చిపోతా నాన్న అంటుంది జో. అస్సలు వీరి మధ్యఏం జరిగింది? ఏం మాట్లాడుకుంటున్నారు? అని పారిజాతం చూస్తుంది.
ఇదీ చదవండి : నాన్నకు తెలియకుండా టెంపుల్స్‌కు వెళ్లేదాన్ని.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన శృతిహాసన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.