Karthikeya 2 OTT: ఓటీటీకి సిద్దమైన `కార్తికేయ 2`.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Nikhil`s Karthikeya 2 to Stream On ZEE5 from Sep 30. కార్తికేయ 2 చిత్రం స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. సెప్టెంబర్ 30 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుందట.
Nikhil's Karthikeya 2 to Stream On ZEE5 from Sep 30: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న సినిమా పేరు 'కార్తికేయ 2'. చిన్న సినిమాగా విడుదలైన కార్తికేయ 2.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టింది. ఆగస్టు 12న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్‌లోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్ సినిమాలు బహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ స్థాయిలో క్రేజ్ సంపాదించింది. ఇప్పటివరకు కార్తికేయ 2 చిత్రం రూ. 120 కోట్ల గ్రాస్.. రూ. 60 కోట్లకు పైగా షేర్‌ను వసూల్ చేసింది.
కార్తికేయ 2 సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ థియేటర్స్‌లో అదరగొడుతోన్నకార్తికేయ 2 చిత్రం అన్ని భాషల్లో సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుందట. ఈ విషయంపై చిత్ర యూనిట్ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందట.
అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించగా.. మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ద్వాపరయుగం నాటి ఒక రహస్యానికి సంబంధించి ఈ సినిమా కథ నడుస్తుంది.
కార్తికేయ 2 సినిమా మలయాళ వెర్షన్ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలలో అత్యధిక ప్రాఫిట్స్ వచ్చిన రెండో సినిమాగా కార్తికేయ 2 నిలిచింది. అంతేకాదు నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయంతో నిఖిల్ గాల్లో తేలిపోతున్నారు.
Also Read: షమీ, చహర్‌లకు షాక్.. డీకేకు చోటు! టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే
Also Read: చిరంజీవి సినిమా కోసం.. నయనతార ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.