Keerthy Suresh : దర్శకుడిని రేయ్ అంటూ సంబోధించిన కీర్తి సురేష్.. ట్వీట్ వైరల్
Dasara Director Odela Srikanth దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి సినిమా రిలీజ్ కాక ముందే ఈ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దర్శకుడి పేరు మార్మోగిపోతుంది
Keerthy Suresh on Dasara Director నాని దసరా మూవీ రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. మరోసారి కీర్తి సురేష్ నేషనల్ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తుందని నాని కూడా ఎంతో నమ్మకంగా చెప్పేశాడు. ఇప్పటికే ఈ సినిమాను పాటలు వచ్చి మెప్పించాయి. ఇప్పుడంతా కూడా కీర్తి సురేష్, నాని చేసిన రీల్స్ మీద పడ్డారు. చమ్కీలఅంగీలేశి అంటూ అందరూ ఒకే పాట పాడుతున్నారు. ఓ వదిన, బామ్మర్ది అంటూ లూప్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.
ఇక కాసేపట్లో దసరా నుంచి ట్రైలర్ రాబోతోంది. దీంతో సినిమా మీద మరింతగా అంచనాలు పెంచేసినట్టు అవుతుంది. లక్నోలో ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. అయితే ఈ ట్రైలర్ మీద ఇప్పటికే అంచనాలు పెరిగాయి. దర్శకుడి మీద జనాలకు భారీ హైప్ ఏర్పడింది. దీంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మీద నెట్టింట్లో రకరకాల మీమ్స్ వస్తున్నాయి.
దీంతో ఓ మీమ్‌ను చూసి కీర్తి సురేష్ రియాక్ట్ అయింది. రేయ్ శ్రీకాంత్ అంటూ తన దర్శకుడి మీద కౌంటర్లు వేసింది కీర్తి సురేష్. అలా దర్శకుడిని రేయ్ అని పిలవడంతో వారిద్దరి మధ్య ఎంత క్లోజ్ నెస్ ఉందో అనే విషయం అందరికీ అర్థమైంది. ప్రస్తుతం ఈ ట్వీట్లో రేయ్ అనే పదమే ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ని నానియే రిఫర్ చేశాడట. వెళ్లి కథ చెప్పమని శ్రీకాంత్‌కు నాని చెబితే.. కీర్తి సురేష్ వద్దకు వెళ్లి మూడు గంటలు నెరేట్ చేశాడట. కానీ కీర్తికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదట. కథ విన్నావా? అని నాని తరువాత అడిగితే..ఏ కథ అని అడిగిందట. అయితే శ్రీకాంత్ తెలంగాణ యాసలో కథ చెప్పడంతో కీర్తి సురేష్‌కు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదట. ఆ విషయం నాని తరువాత అర్థం చేసుకుని మళ్లీ కథ వినమని కీర్తి సురేష్‌కు చెప్పాడట.
కీర్తి సురేష్‌కు తెలుగు సరిగ్గానే అర్థం అవుతుందని, కానీ తెలంగాణ యాస అంతగా అర్థం కాదట. అందుకే ఓ ట్రాన్స్ లేటర్‌ను పెట్టుకుని మరీ కథ విన్నదట. కథ విన్న తరువాత ఇంత మంచి పాత్రను మిస్ అయ్యేదాన్ని అనుకుందట. అలా ఈ సినిమాలోకి కీర్తి సురేష్ వచ్చేసిందట.
Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook