కేజీఎఫ్ ( KGF ) మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. కరోనావైరస్ ( Coronavirus )  వల్ల నిలిచిన కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ ఇవాళ మొదలైంది. ఈ విషయం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్  కొన్ని రోజుల ముందే ప్రకటన చేసి ఆగస్టు 26 నుంచి షూటింగ్ షురూ అన్నాడు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసి బ్యాక్ టు వర్క్ ( షూటింగ్ ) అని కేజీఎఫ్ చాప్టర్ 2లో తను చేస్తున్నట్టు ఇలా ప్రకటించాడు. యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1లో అనంత్ నాగ్ చేసిన రోల్ లో ప్రకాష్ రాజ్ రీప్లేస్ అయినట్టు తెలుస్తోంది.



కేజీఎఫ్ 1 జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించడంతో మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కోవిడ్-19 వల్ల కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2 )  చిత్రీకరణ వాయిదా పడింది. 




దాంతో పాటు ఈ మూవీలో అధీరా పాత్ర చేస్తున్న సంజయ్ దత్ ( Sanjay Dutt ) కూడా ఆనారోగ్యం వల్ల చిత్రీకరణకు దూరం అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ బాగా టెన్షన్ పడ్డారు. అయితే షూటింగ్ మళ్లీ ప్రారంభం కావడంతో ఊపిరి పీల్చకున్నారు. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని అని ప్లాన్ చేస్తున్నారు.