Kiran Macha Insults shraddha das in Dhee 14: మీరు ఏదైనా చేయండి కానీ నన్ను ఎంటర్టైన్ చేయండి అంటూ అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు అదే డైలాగు నిజం చేయడానికి మల్లెమాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రోగ్రాముల డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. గతంలో మల్లెమాల ఆధ్వర్యంలో నడిచే ఢీ షో, జబర్దస్త్ అలాగే మరికొన్ని షోలకు మంచి రేటింగులు వచ్చేవి. కానీ క్రమక్రమంగా ఆ రేటింగ్లు పడిపోతూ ఉండడంతో ఆయా కార్యక్రమాల నిర్వాహకులు చేయని రాక్షస ప్రయత్నాలు అంటూ ఉండడం లేదు. ఆసక్తికరంగా, ఉత్సుకత రేకెత్తించే విధంగా ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులలో ఆసక్తి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి కార్యక్రమాలలో ఇలాంటి ప్రయోగాలు చేసి విఫలమవగా ఇప్పుడు కొత్తగా ఢీ షోలో కూడా ఇలాంటి ప్రయోగమే చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా ప్రసారమవుతున్న ఢీ షో 14వ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఒక వ్యక్తి హీరోయిన్ శ్రద్ధాదాస్ సహా ప్రదీప్ తో గొడవ పడుతున్నట్లు చూపించారు. అతను ఎవరో కాదు సోషల్ మీడియాలో అతను అందరికీ పరిచయమే. అనేక మందితో ప్రాంక్ లు చేసి ప్రాంక్ స్టార్ కిరణ్ మచ్ఛాగా పేరుపొందిన కిరణ్.


ఆయన ఇప్పుడు ఢీ 14లో బాయ్స్ టీమ్ కి మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా జరిగిన కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండ్లో ఒక పర్ఫామెన్స్ అయిన తర్వాత శ్రద్ధాదాస్ వెళ్లి కంటెస్టెంట్లతో కలిసి డాన్స్ వేయడం కనిపిస్తోంది. ఆ తరువాత ఈ విషయం మీద ఫైర్ అయిన కిరణ్ ఆమె వెళ్లి వాళ్లతో డాన్స్ చేయడం కరెక్ట్ గా అనిపించడం లేదని వాళ్లతో డాన్స్ చేసింది కాబట్టి వాళ్ల వైపు పక్షపాతంగా వ్యవహరించి వాళ్లకు మంచి మార్కులు ఇస్తే మా పరిస్థితి ఏమిటి అని అడగడం కనిపించింది. ఈ విషయంలో ప్రదీప్ మాచిరాజు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా ఆయన మీద కూడా కిరణ్ ఫైర్ అయ్యాడు. తరువాత శ్రద్ధాదాస్ కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇస్తూ ఉండడంతో మీరు అంత గట్టిగా మాట్లాడవద్దని ఆమెకు సూచిస్తాడు కిరణ్, ఆమె వెంటనే మీరు కూడా అరుస్తున్నారు కదా అంటే నేనేం చేయాలో మీరు నాకు చెప్పక్కర్లేదు అంటూ ఆమెను అవమానించడం కనిపిస్తోంది.


తరువాత అతనిని సెట్ నుంచి బయటకు తీసుకు వెళ్ళిపోతున్నట్లుగా ప్రోమో కట్ చేశారు. అయితే ప్రేక్షకులు అయితే ఇదంతా ప్రాంక్ అనే భావిస్తున్నారు. గతంలో అనేకమార్లు మల్లెమాల అండ్ టీం ఇలాంటి ప్రాంక్లు చేసి తమకు చిరాకు తెప్పించారని మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుధీర్, రష్మీ వంటి వారు ఉన్నప్పుడు ఈ ప్రోగ్రాములకు మంచి రేటింగ్స్ వచ్చేవని వారు లేకపోవడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి కూడా మల్లెమాల టీం వెనకాడడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
 Also Read: Bimbisara: టాప్ ప్రొడ్యూసర్ తో బింబిసార చూసిన ఎన్టీఆర్... కీలక నిర్ణయం!


Also Read: Pawan Kalyan: తీవ్ర అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఆ నిర్వాకంతోనే?