Kolywood actor Vijayakanth's Toes removed Due To Diabetes: కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండేకే అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా ఆయన కుడి కాలి వేళ్లలో మూడింటిని వైద్యులు తొలగించారు. కెప్టెన్‌ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో.. వైద్యు అత్యవసరంగా వేళ్లను తొలగించారట. ప్రస్తుతం సీనియర్ హీరో విజయకాంత్‌ బాగానే ఉన్నారని, మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సమాచారం తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కెప్టెన్‌ అభిమానులు, ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెప్టెన్‌ విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు సర్జరీల మీద సర్జరీలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా కెప్టెన్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. గతంలో ఓ సర్జరీ చేయించుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విజయకాంత్‌కు మరో సర్జరీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమాలు చేసి చాలా ఏళ్లు అవుతుంది. ఇక కెప్టెన్‌ను బయట చూసి ఎన్నో ఏళ్లు అయింది.


విజయకాంత్‌ తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితులే. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. కెప్టెన్ భరత్, రమణ, నరసింహా లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇక విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2005లో దేశీయ ముర్‌పొక్కు ద్రవిడ కళగమ్ (డీఎండీకే) పార్టీ స్థాపించారు. ప్రజల్లో ఆయన పార్టీకి ఆదరణ బాగా పెరిగింది. అయితే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీఎండీకే పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గింది. ప్రస్తుతం విజయకాంత్‌ భార్య ప్రేమలత, బావమరిది సుధీష్‌లు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు.


Also Read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!  


Also Read: Horoscope Today June 22 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అక‌స్మిక ధ‌న‌ లాభం!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.