Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!

June 22nd 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,980గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 22, 2022, 07:28 AM IST
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!

Today Gold and Silver Rates: దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఉన్న డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు లాంటి చాలా కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడి, వెండికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు కాబట్టి.. ధరలు పెరిగినా వ్యాపారాలు జోరుగానే కొనసాగుతూ ఉంటాయి. 

దేశంలో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది. బుధవారం (జూన్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,650లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,980లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై రూ. 100 తగ్గింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,680 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,010గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,950గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680.. 24 క్యారెట్ల ధర రూ. 52,010గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,680 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,980గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,650.. 24 క్యారెట్ల ధర రూ. 51,980గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,300లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 66,300లుగా ఉంది. 

Also Read: Horoscope Today June 22 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అక‌స్మిక ధ‌న‌ లాభం!

Also Read: Powerful Zodiac Signs: అత్యంత శక్తివంతమైన రెండు రాశులేంటో తెలుసా, ఎలా ఉంటుంది ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News