Komaram Bheemudu Video Song: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం). మార్చి 25న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రాజమౌళి వర్క్ తో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన ఈ సినిమాకు వన్నె తెచ్చాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రీ-క్లైమాక్స్ లో వచ్చే 'కొమురం భీముడో' సాంగ్ కు చాలా మంది థియేటర్లలోనే ఏడ్చేసిన సంఘటనలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కొమురం భీముడో' పాటలో ఎన్టీఆర్ నటనకు చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారు. అంతటి పాపులర్ అయిన పాట వీడియో కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడా వీడియోను విడుదల చేసేసింది చిత్రబృందం. ఇప్పుడా వీడియోకు సోషల్ మీడియాలో విశేషాదరణ లభిస్తోంది. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. 



'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనువిందు చేయగా.. కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ కు హీరోయిన్ గా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు.  


Also Read: AVAK OTT: ఈరోజే విడుదలైన 'అశోకవనంలో అర్జున కల్యాణం'.. అప్పుడే ఓటీటీలోకి!


Also Read: Ante Sundaraniki Song: 'అంటే సుందరానికీ!' హీరోయిన్ తో లవ్ సాంగ్ కావాలట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.