Ante Sundaraniki Song: 'అంటే సుందరానికీ!' హీరోయిన్ తో లవ్ సాంగ్ కావాలట!

Ante Sundaraniki Song: నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన కొత్త చిత్రం 'అంటే సుందరానికీ!'. వచ్చే నెల 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచేసిన చిత్రబృందం.. సినిమాలోని రెండో సాంగ్ 'ఎంత చిత్రం'ను విడుదల చేయనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 12:17 PM IST
Ante Sundaraniki Song: 'అంటే సుందరానికీ!' హీరోయిన్ తో లవ్ సాంగ్ కావాలట!

Ante Sundaraniki Song: టాలీవుడ్ కథానాయకుడు నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా ఫాజిల్ కలిసి నటిస్తోన్న చిత్రం 'అంటే సుందరానికీ!'. వచ్చే నెల అనగా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. ఇప్పుడీ సినిమాలోని రెండో లిరికల్ సాంగ్ 'ఎంత చిత్రం'ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. 

'అంటే సుందరానికీ!' సినిమా నుంచి ఇప్పటికే 'పంచెకట్టు' అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. దీనికి సోషల్ మీడియాలో తగిన రెస్పాన్స్ వస్తోంది. దీని తర్వాత ఇప్పుడు 'ఎంత చిత్రం' లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేయనుంది. మే 9న ఉదయం 11.07 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'ఎంత చిత్రం' పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా.. అనురాగ్ కులకర్ణి, కీర్తన ఆలపించారు. 

నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ యార్నేని నిర్మాతలుగా వ్యవహరించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.  

Also Read: Nivetha Pethuraj Photos: ఈ బ్యూటీకి కారు రేసింగ్ అంటే చాలా ఇష్టమట!

Also Read: Vishwak Sen Ban: విశ్వక్ సేన్ పై మంత్రి ఆగ్రహం.. హీరోపై బ్యాన్ విధించే అవకాశం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News