Krithi Shetty on Liplock: 'ఉప్పెన' చిత్రంతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి వ‌రుస బెట్టి తెలుగులో ఆఫ‌ర్స్ అందుకుంటుంది. ఇటీవ‌ల 'శ్యామ్ సింగ‌రాయ్' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కృతి ఇప్పుడు.. 'ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది' అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే 'శ్యామ్ సింగ‌రాయ్' చిత్రంలో కృతి బోల్డ్ సీన్స్‌లో న‌టించ‌డంపై స్పందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"బోల్డ్‌ సీన్స్‌ అంటే అందరూ చెడు ఉద్దేశంతో చూస్తారు. ఏం చేసినా అంతా వృత్తిపరంగానే చూస్తా. సినిమా కోసం ఏమి చేసినా.. అది యాక్టింగ్‌. యాక్షన్ సీన్స్‌లో ఎంత కష్టపడతామో ఇవీ అంతే. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాం. హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో రాకముందు నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్ చేస్తా. లేదంటే చేయను. 'శ్యామ్‌ సింగరాయ్‌'లో నాకు నానికి మధ్య వచ్చిన బోల్డ్‌ సీన్‌ కథ డిమాండ్‌ చేసింది. కథకు ఆ సీన్‌కి సంబంధం ఉంది కాబట్టే చేశా" అని హీరోయిన్ కృతిశెట్టి చెప్పుకొచ్చింది. 


'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో పాత్ర కోసం స్మోకింగ్ చేయడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లు హీరోయిన్ కృతి శెట్టి వెల్లడించింది. స్మోకింగ్ అంటే తనకు అసహస్యమని దర్శకుడు రాహుల్ కు చెప్పి.. ఆ సన్నివేశాలను తీయించేందుకు కృతి ప్రయత్నించిందట. కానీ, కథ డిమాండ్ చేయడం వల్ల స్మోకింగ్ లో అనేక జాగ్రత్తలు పాటిస్తూ ఆ పాత్రలో నటించినట్లు ఆమె పేర్కొంది. 


సినిమాలో తాను కాల్చే సిగరెట్లలో నికోటిన్ లేకుండా హెర్బల్ సిగరెట్ ను వినియోగించారని.. తన కోసం స్పెషల్ గా తయారు చేయించారని కృతి చెప్పుకొచ్చింది. మొదటిసారి పట్టుకున్నప్పుడు నా చేయి వణికినా.. ఆ తర్వాత సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత కాస్త తేలిక అయ్యిందని బేబమ్మ వెల్లడించింది. 


మరోవైపు రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించనున్నారు. హీరో రామ్ కు గాయం కారణంగా ఈ చిత్ర షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ పడింది. ఆ సినిమా తిరిగి ప్రారంభమయ్యే లోపు 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' చిత్రంతో బిజీగా ఉండనుంది కృతి శెట్టి. మరోవైపు నితిన్ హీరోగా నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలోను కృతి క‌థానాయిక‌గా న‌టిస్తుంది.  


Also Read: Karate Kalyani Latest News: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కల్యాణి


Also Read: Dakko Dakko Meka Video Song: 'పుష్ప' నుంచి బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'దాక్కో దాక్కో మేక' వీడియో సాంగ్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి