Puri Jagannadh Audio Leak : లైగర్ సినిమా ఎంత దారుణంగా దెబ్బ కొట్టేసిందో అందరికీ తెలిసిందే. విడుదలైన ప్రతీ చోటా నష్టాలనే మిగిల్చింది. అందులోనూ మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీ రేటుకు కొనుగోలు చేయడంతో.. పెద్ద దెబ్బ అక్కడి వారికే పడ్డట్టు అయింది. అందుకే నైజాంకు చెందిన  83 మంది ఎగ్జిబిటర్స్ అంతా కలిసి పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాలని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఈ మేరకు పూరి ఆడియో కాల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొట్టిందట. అందులోని అంశాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగిఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయర్స్ తో మాట్లాడ్డం జరిగింది. మన ఒప్పందం ప్రకారం చెప్పిన మొత్తాన్ని ఒక నెలలో ఇస్తాను. అలా చెప్పాక కూడా మళ్లీ ఇలా చేస్తుంటే ఇవ్వాలని అనిపించదు. అయినా మేం ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను.


ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని సినిమాలు ఆడతాయి. కొన్ని సినిమాలు పోతాయి. పోకిరి దగ్గరనుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో వుంది. బయర్స్ అసోసియేషన్ నాకు ఆ అమౌంట్ వసూల్ చేసి పెడుతుందా? ధర్నా చేస్తాం అంటున్నారు. చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకోని, వాళ్ళకి తప్ప మిగతావాళ్ళకి ఇస్తా' అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఓ ఆడియో కాల్, మెసెజ్ వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో పూరికే తెలియాలి.


అయితే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతా కలిసి ఇలా ప్లాన్ వేసుకున్నారట. వాటికి సంబంధించిన వాట్సప్ స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ' బేస్తవారం ఉదయం 9 గంటలకు 27వ తారీఖున ప్రతి ఎగ్జిబిటర్ పూరి జగన్నాథ్ గారి ఇంటికి ధర్నాకి వెళ్తున్నాము కావున ప్రతిఒక ఎగ్జిబిటర్ మినిమం నాలుగు రోజులు ఉండటానికి బట్టలు తీసుకొని ఎగ్జిబిటర్ తో నలుగురు వ్యక్తులను తీసుకొని రావాలి.


ఇలా అందరూ మాకెందుకులేని రాకపోతే ఈ బాధితుల నుంచి లిస్టులో నుంచి మీ పేరు తొలగించి మీకు రావాల్సిన డబ్బులు అని కూడా క్యాన్సల్ చేయబడును దీన్ని హెచ్చరికగా భావించకుండా తప్పనిసరిగా రాగలరు ఎవరు ఆరోజు రాకపోయినా నుంచి మీకు మేము ఫోన్ చేయము. ఇన్ఫర్మేషన్ ఇవ్వము అందరూ బాధితులమే కాబట్టి అందరూ బాధ్యతగా వస్తేనే బాగుంటుంది రాకపోతే మీ ఇష్టం. అందరూ ఉదయ రెడ్డి వేణు వేణుగోపాల్ రెడ్డి ఆఫీస్ కి రావాలి. అక్కడి నుంచి పూరి జగన్నా ఇంటికి వెళ్లాలి. మళ్లీ మళ్లీ చెప్తున్నాము దయచేసి మీరందరూ రావాలి. మీరు పైసలు వద్దు అనుకున్న వాళ్లు మాత్రం రాకండి దయచేసి.' అని అందులో ఉంది.


ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఆడియో కాల్, ఈ వాట్సప్ స్క్రీన్ షాట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశం, ధర్నాకు దిగబోతోండటం అనే వాటిలో ఎంత నిజముందో పూరి జగన్నాథ్, లైగర్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకే తెలియాలి. మొత్తానికి లైగర్ ఎఫెక్ట్ మాత్రం ఇంకా తగ్గలేదని తెలుస్తోంది. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ డిజాస్టర్ల లిస్ట్‌లో విజయ్ లైగర్ కూడా ఉంటుంది. సినిమా ముందున్న హైప్ వల్లే.. ఈ రేంజ్ నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. సినిమాలో విషయం లేకపోవడం, అవుట్ డేటెడ్ స్టోరీ అవ్వడం, పూరి మార్క్ కనిపించకపోవడంతో సినిమాను చూసిన జనాలు తిరస్కరించేశారు.


Also Read : ప్రభాస్ కు హీరోలెవరూ విషెష్ చెప్పలేదెందుకబ్బా.. అసూయే కారణమా?


Also Read : Bandala Ganesh - Diwali 2022 : దీపావళి బాంబులకు పెట్టిన ఖర్చు ఎంతంటే?.. బండ్లన్నతో అట్లుంటది.. అన్ని లక్షలా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook