Taraka Ratna Death Live Updates: ముగిసిన తారకరత్న అంత్యక్రియలు.. నుదుటిపై ముద్దు పెట్టి ఏడ్చిన తండ్రి మోహన కృష్ణ!
Taraka Ratna Death Live Updates: గత ఇరవై రోజులకు పైగా తారకరత్న హాస్పిటల్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందించారు. అయితే తారకరత్న నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో చికిత్సకు స్పందించలేదు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు.
Taraka Ratna Health Live updates నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణవార్తను అధికారికంగా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడించారు. తారకరత్న మృతితో సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. అయన కుటుంబాన్ని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సందర్శించి తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.
Latest Updates
ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
చితికి నిప్పు పెట్టిన తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ
చివరిసారి తారకరత్న నుదుటిపై ముద్దు పెట్టి ఏడ్చిన తండ్రి మోహన కృష్ణ
మహప్రస్థానంలో మొదలైన తారకరత్న అంత్యక్రియలు
తారకరత్న పాడే మోసిన బాలకృష్ణ.
తారక రత్న కు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్న తనయుడు తనయ్ రామ్
మహా ప్రస్థానంకు చేరుకున్న తారకరత్న భౌతికకాయం
మహా ప్రస్థానంకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
తారకరత్న కోసం వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి..
తారకరత్న పార్థివదేహాన్ని సందర్శించేందుకు మతిస్థిమితం లేని వ్యక్తి వచ్చాడు. తారకరత్నను చూసిన తరువాత బాలయ్యతో ముచ్చట్లు పెట్టాడు. కానీ పోలీసులు వెంటనే అతడ్ని పక్కకి తీసుకెళ్లారు.
నివాళి అర్పించిన వెంకీమామ..
తారకరత్న భౌతిక కాయానికి టాలీవుడ్ ప్రముఖులంతా నివాళి అర్పిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, నటుడు శివాజీ, దర్శకుడు అనిల్ రావిపూడి వంటి వారు నివాళి అర్పించారు. హీరో తరుణ్ కూడా సందర్శించుకున్నాడు. ఇక వెంకటేష్ అయితే తారకరత్న భౌతిక కాయాన్ని చూసి అలా నిల్చుండిపోయాడు. ఏమీ మాట్లాడకుండా మౌనం పాటించాడు.
ఉదయం 9.03 గంటలకు శంకర్ పల్లిలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు పార్ధివ దేహం తరలింపు
10 గంటల నుంచి అభిమానుల సందర్శనకు అవకాశం
3 గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఈ మేరకి ముహూర్తం పెట్టిన బాలకృష్ణబాలయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగలించుకొని ఏడ్చిన తారక రత్న కుమార్తె
సీసీఎల్ లో అఖిల్ టీం విక్టరీ.. తారకరత్నకు అంకితం అంటూ పోస్ట్
'బ్రతుకుతో పోరాడావ్.. చావుతో పోరాడావ్.. నీ అలైఖ్యలో ఎప్పటికీ జీవించే ఉంటావ్' అంటూ షర్మిల ట్వీట్ చేశారు
తారకరత్న మరణం పై దగ్గుబాటి పురందేశ్వరి స్పందన
తారకరత్న ఎప్పుడూ చక్కటి చిరునవ్వుతో కనిపించేవాడు
అత్తా అనే పిలుపు నీ నుంచి ఇక వినకపోవచ్చు
నువ్వెప్పుడూ మా హృదయంలో, మదిలో, స్మృతిలో చిరంజీవిగా ఉంటావు
లవ్ యూ తారకరత్న అంటూ పురందేశ్వరి ట్వీట్
అలేఖ్యా రెడ్డి అస్వస్థతపై ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందన
తారక రత్న మరణం ఎంతో బాధించింది
39 ఏళ్లలోనే అకాల మరణం బాధాకరం
రాజకీయ రంగంలోకి ప్రవేశించే సందర్భంలో ఇలాంటి ఘటన బాధకరం
అందరిని అన్న, చెల్లి అని ఆప్యాయంగా పలకరించేవాడు
తారక్ కి ముగ్గురు పిల్లలు, మొదట పెద్దమ్మాయి, తర్వాత ట్విన్స్
ఇందులో ఒకరు బాబు..ఇంకొకరు పాప
తారక్ విషయంలో బాలకృష్ణ చాలా శ్రద్ధ చూపారు
అత్యంత మంచి చికిత్స అందించాడానకి కృషి చేశారు
అలేఖ్య మానసిక ఒత్తిడికి గురైంది
కాళ్లు చేతులు వణుకుతున్నాయి, ఆందోళన లేదు
ప్రేమించిన వ్యక్తి కోల్పోవడంతో అలా అయ్యింది
అలేఖ్యకి బాలకృష్ణ మాట ఇచ్చారు
మా కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటాం
ఆందోళన వద్దని మాట ఇచ్చారుతారకరత్న భార్యా అలేఖ్య రెడ్డిని పరామర్శించిన వైఎస్ షర్మిల
రేపు మధ్యాహ్నం వరకు అమావాస్య
ఉదయం 7 గంటల కల్లా తారక రత్న ఇంటికి బాలకృష్ణ
ఉదయం 9.03 నిమిషాలకు ఇంటి నుండి తారక రత్న భౌతిక కాయం ఫిల్మ్ ఛాంబర్ కి
అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం
మూడు గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ లో భౌతిక కాయం
మూడున్నర తర్వాత అంతిమ యాత్ర ప్రారంభం
4 నుంచి 5 గంటల మధ్య అంతిమ సంస్కారాలు
తారకరత్న భార్య అలేఖ్యకు అస్వస్థత..
రెండు రోజులుగా ఏమి తినకపోవడంతో నీరసించిన అలేఖ్య
అలేఖ్యను ఆసుపత్రికి తరలించే యోచన కుటుంబ సభ్యులు..
తారకరత్న కుటుంబానికి మోహన్ బాబు పరామర్శ
తారకరత్న ఎంత మంచివాడో, ఎంత సౌమ్యుడో, స్నేహ శీలో చెప్పడానికి మాటలు రావడం లేదు
టీవీల్లో అతని మరణ వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే బాధతో గుండె తరుక్కుపోతుంది
తారకరత్న మరణం ఒక్క నందమూరి కుటుంబానికే కాదు
యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: మోహన్ బాబు
నందమూరి తారకరత్న భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళులు
తారకరత్న నివాసానికి చేరుకుని తారకరత్న కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి
తారకరత్న భార్యను ఓదార్చిన మెగాస్టార్ చిరంజీవి
తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
తారకరత్న మృతిపై కొడాలి నాని సంతాపం
తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు, కలిసి మెలిసి ఉండే వ్యక్తి
టీడీపీలో కొనసాగాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు
నేను తారక్ అని పిలిచే వాడిని
నాతో ఎంతో మంచి ఫ్రెండ్ గా మెదిలేవాడు
తారకరత్న దేనికి ఆశ పడలేదు
ఎన్టీఆర్ బాటలో నడవాలని అనుకున్నారు
ఆయనకు తండ్రి వైపు టీడీపీ
అత్తగారి ఇంటి వైపు వైసీపీ ఉంది
రాజకీయాల్లోకి వస్తానని నాతో ఫోన్ లో చెప్పాడు
రేపు ఉదయం 8.45కి ఫిల్మ్ ఛాంబర్ కి తారక రత్న భౌతిక కాయం : మాదాల రవి
3 గంటల వరకు అక్కడే, ఆ తర్వాత అంతిమ యాత్ర : మాదాల రవి
తారక రత్న అసలు పేరు ఓబు, మేమంతా ఓబులేష్ అని పిలిచే వాళ్ళము : మాదాల రవి
బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం మేరకు అంత్యక్రియలు : మాదాల రవి
బాలకృష్ణ. తారక రత్నను బాగా చూసుకునే వారు, ఇంటి పెద్ద కదా : మాదాల రవి
బాలకృష్ణ, విజయ సాయి రెడ్డిలు ఇది నిర్ణయించారు : మాదాల రవిమహమ్మద్ అలీ నివాళులు..
తారకరత్న భౌతిక కాయాన్ని తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ దంపతులు సందర్శించారు. అనంతరం నివాళులు అర్పిస్తూ సంతాపాన్ని ప్రకటించారు.
తారకరత్న భౌతిక కాయానికి నారా లోకేష్, బ్రాహ్మణి నివాళులు
నివాళులు అర్పించిన నారా లోకేష్..
నారా లోకేష్ కాసేపటి క్రితమే తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం నారా లోకేష్ ఇలా తారకరత్న చిత్రపటానికి నమస్కరిస్తూ సంతాపాన్ని ప్రకటించాడు.విజయ్ సాయి రెడ్డితో ఎన్టీఆర్ ముచ్చట్లు..
తారకరత్న పార్థివదేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఇప్పుడే తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇక అక్కడే ఉన్న విజయ్ సాయి రెడ్డితో ఎన్టీఆర్ ముచ్చటించారు.
తారకరత్నకు నివాళులర్పించిన కమెడియన్ ఆలీ దంపతులు
తారకరత్నకు నివాళులర్పించిన నారా లోకేష్
తారకరత్నకు నివాళులర్పించిన దేవినేని ఉమామహేశ్వరరావు
చంద్రబాబుతో మాట్లాడిన విజయసాయి రెడ్డి
నందమూరి తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వచ్చిన చంద్రబాబు
పక్కనే ఉన్న విజయసాయిరెడ్డితో మాటామంతీ
తారకరత్న చికిత్స తీరు గురించి చంద్రబాబుకు వివరించిన విజయసాయి
ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కాసేపు మాటలు
అంతకుముందు ఎన్టీఆర్తోనూ విజయసాయి మాటలు
గతంలో తారకరత్నను ఆస్పత్రిలో పరామర్శించిన విజయసాయి
తారకరత్నను దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన విజయసాయి
తారకరత్న మృతికి నరేష్ ఎమోషనల్ వీడియో
తారకరత్న నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటామంతీ
తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఇరువురు నేతలు
తారకరత్న చావుకు అదే కారణం.. అసలు ఏమైందంటే?
పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందు కన్నుమూసిన తారకరత్న..దురదృష్టమంటే ఇదేనేమో!
ఉదయం నుంచి తారకరత్న నివాసంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయసాయితో మాట్లాడుతూ కనిపించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
తారకరత్న కోసం ప్రభలు ఊరేగింపు, కానీ ఇంతలోనే
తారకరత్న కోలుకోవాలని నందమూరి అభిమానులు ప్రార్థనలు
ఎన్ని ప్రార్ధనలు చేసినా కనికరించని దేవుడు
మహాశివరాత్రి సందర్భంగా నిన్న పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లలో భారీ ప్రభ ఏర్పాటు
తారకరత్న ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రభ ఊరేగింపు
సాయంత్రం తారకరత్న మరణించారని వార్త రావడంతో విషాదంలో మునిగిపోయారు
తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించిన జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ శివారులోని మోకిల నివాసంలో నందమూరి తారకరత్న పార్థివ దేహం
తారకరత్న పార్థీవదేహాన్ని సందర్శించిన ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
తారకరత్న భౌతికకాయానికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
తారకరత్న సతీమణి, కుటుంబ సభ్యులను ఓదార్చి, చెప్పిన బ్రదర్స్తారకరత్న మృతికి ప్రధాని మోడీ సంతాపం
తారకరత్న అకాల మరణం బాధాకరం, తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోడీ
జూనియర్ ఎన్టీఆర్‌ని తొక్కేసేందుకే తారకరత్న పోటీగా వచ్చారా ? తారకరత్న ఏమన్నారంటే..
మీరు మునుపెన్నడూ చూడని తారకరత్న రేర్ ఫోటోలు
తారకరత్న విలన్‌గా నటించిన చిత్రాలు ఇవే.. ఆ సినిమాకు నంది అవార్డు
తారకరత్న మరణానికి కారణం ఇదే
తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమిషాలు నిలిచిన రక్తప్రసరణ
ఆ సమయంలో మెదడులో కొంతభాగం దెబ్బతిందని గుర్తించిన వైద్యులు
అందుకే మెదడులో నీరు చేరినట్లు చెబుతున్న వైద్యులు
గుండె, కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ మెదడు దెబ్బతినడంతో కోలుకోలేకపోయిన తారకరత్న
చాలా రోజులు వెంటిలేటర్ మీద చికిత్స అందించినా దక్కని ఫలితం
విదేశాల నుంచి నిపుణులైన డాక్టర్లను రప్పించినా దక్కని ఫలితం
తారకరత్న నటించిన చివరి సినిమా..అందులోని ఆయన పాత్రేమిటో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో తారక రత్నకు విబేధాలు?.. అసలు నిజం ఏమిటి?
మోకిలలోని స్వగృహానికి తారక రత్న పార్థివదేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..
9 నెంబర్ అసలు కలిసిరాని తారకరత్న.. అందుకే ఇలా అయిందా?
శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యమైన తారకరత్న.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!
తారకరత్న భార్యకు రెండో పెళ్లి
ఆమెను పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరం
తారకరత్నకు తొలి వివాహమే
కానీ అలేఖ్యకు ఈ వివాహం రెండోది
మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు సందీప్ తో ఆమెకు మొదటి పెళ్లి
కలిసి ఉండలేక విడాకులు
ఆ తర్వాత ప్రేమలో పడి వివాహం చేసుకున్న తారకరత్న, అలేఖ్య
ఇద్దరినీ దూరంగా పెట్టిన కుటుంబాలు
సొంత చెల్లెలు రూప పెళ్లికి కూడా తారకరత్నకు అందని ఆహ్వానం
ఈమధ్యనే ఒకటైన కుటుంబాలుమరో 3 రోజుల్లో తారకరత్న పుట్టినరోజు
1983 ఫిబ్రవరి 22న హైదరాబాద్లో జన్మించిన తారకరత్న
3 రోజుల్లో ఆయనకు 40 ఏళ్లు పూర్తిత్వరలో తారకరత్న సినిమా రిలీజ్!
చివరగా 'ఎస్5: నో ఎగ్జిట్ 'లో నటించిన తారకరత్న
చిత్రీకరణ దశలో మరో 2 సినిమాలు
వాటిలో ఒక మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్న మేకర్స్
ఫిబ్రవరి 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు
తారక రత్న రిలీజ్ చేస్తారో? వాయిదా వేస్తారో? తెలియాల్సి ఉందితారకరత్న మృతిపై లిరిక్ రైటర్ చైతన్య ప్రసాద్ ఎమోషనల్ నోట్
మీ అకాల నిష్క్రమణం చాలా బాధాకరం.
కలిసిన ప్రతిసారీ మీరు చూపిన మర్యాదా మన్ననలు మరువలేనివి
మీతో నేను పని చేసినది ఒకే ఒక్క సినిమా -
'మహాభక్త సిరియాళ.'
నేను రాసినవి రెండే రెండు పాటలు.
అందులో చివరి పాట" ఈ దేహము ఈ ప్రాణము ఈ జీవితమూ
పరమ శివుని పదములకే అవి అంకితమూ
శివుని ఆన లేనిదే - చీమైనా కుట్టదూ
భవుని పిలుపు రానిదే - భవ బంధం వీడదూ
ఆత్మ శుద్ధి కోసమే
ఆ దేవుని శోధన
అయినా వీడదు ఎపుడూ
ఈ జీవుని వేదన "తారక రత్న గారూ! సినిమా సందర్భానికి పాట అలా రాసాను గానీ... శివరాత్రి నాడు మీరిలా...!
అస్సలు ఊహించలేదు. భారమైన మనసుతో శిరసా నమస్కరించి వీడ్కోలు పలకడం వినా... ఏం చేయగలం !సెలవు 🙏
తారకరత్న మృతిపై రామ్ చరణ్ సంతాపం
మోకిలలోని స్వగృహానికి చేరుకున్న తారక రత్న పార్థివదేహం
కొద్దిసేపటి క్రితమే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని మొకిలలో ఉన్న తారక రత్న స్వగృహానికి ఆయన కుటుంబసభ్యులు పార్దేవ దేహాన్ని తీసుకొచ్చారు. నందమూరి తారక రత్న పార్ధివదేహం వస్తోందని ముందే తెలుసుకున్న నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో మోకిలలో తారక రత్న నివాసం ఉంటున్న విల్లా వద్దకు చేరుకున్నారు.
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం
తారకరత్న కుటుంబ సభ్యులకు సిఎం కె.చంద్రశేఖర్ రావు తన ప్రగాఢ సానుభూతి
ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి :తలసాని
తారకరత్న మరణం పై అలీ తీవ్ర దిగ్భ్రాంతి
తారకరత్న సినీ కెరీర్ ప్రారంభం నుంచి అలీతో ప్రత్యేక అనుబంధం
తారకరత్నతో నాలుగు చిత్రాల్లో కలిసి నటించిన అలీ
తారకరత్న చివరి సినిమా ఎస్ 5 సినిమాలో కూడా నటించిన అలీ
తారకరత్న ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం మనసును తీవ్రంగా కలచవేసింది: అలీ
తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని వేడుకున్నా : అలీ
తారకరత్న మృతికి ఆయన సోదరి సుహాసిని ఎమోషనల్
తారకరత్న మృతిపై స్పందించిన బాలకృష్ణ
బాల బాబాయ్ అన్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా - నందమూరి బాలకృష్ణ
బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా
నందమూరి అభిమానులకు, టిడిపి కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు
నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు
కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు
తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి: నందమూరి బాలకృష్ణ
తారకరత్న మృతికి నిర్మాత నాగవంశీ సంతాపం
తారకరత్న మృతికి అనిల్ రావిపూడి సంతాపం
హాస్పటల్ వెనుక గేటు నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో తరలింపు బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన తారకరత్న మృతదేహం
అభిమానుల తాకిడి వల్ల ఎటువంటి సమాచారం లేకుండా హాస్పటల్ వెనుక గేటు నుంచి తరలించిన నేపథ్యంలో అభిమానులు ఆగ్రహం
సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన నందమూరి అభిమానులు
బెంగుళూరు నుండి హైదరాబాదు బయలుదేరిన తారకరత్న మృతదేహం
నందమూరి తారకరత్న మృతి పట్ల సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి
తారకరత్న కోలుకుని ప్రజా జీవితంలోకి తిరిగి వస్తారని భావించా
కానీ దురదృష్టవశాత్తు వారి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది
తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి
కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నా
తారకరత్న మృతికి కింజరాపు అచ్చెన్నాయుడు సంతాపం
సినీనటుడు, టీడీపీ నేత తారకరత్న మరణం దిగ్బ్రాంతికి గురి చేసింది : కింజరాపు అచ్చెన్నాయుడు
పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉండే తారకరత్న మృతి చెందారన్న మాట కోట్లమంది అభిమానులు, కార్యకర్తలు, పార్టీకి తీరని లోటు
చిన్న వయసులోనే గుండెపోటుతో పోరాడి స్వర్గస్తులయ్యారు
తిరిగి వస్తారనుకున్న తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లాడన్నది నమ్మలేక పోతున్నాం
తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా
కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా
తారకరత్న మృతికి విజయసాయిరెడ్డి సంతాపం
ఆరోగ్యంగా తిరిగొస్తాడని అనుకున్నాం : విజయసాయిరెడ్డి
తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నా
కానీ విధి మరోలా తలచింది
తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం
తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నా
తారకరత్న అభిమానులకు ప్రగాఢ సానభూతి తెలియజేన్నా
తారకరత్న మృతికి నాగచైతన్య సంతాపం
తారకరత్న మృతికి మహేష్ బాబు సంతాపం
తారక రత్న మృతికి హీరో రవితేజ సంతాపం
తారకరత్న మృతికి కేశినేని చిన్ని సంతాపం
నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది
వారు లేని లోటు ఆయన కుటుంబ సభ్యలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ తీరని లోటు
వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నా
తారకరత్న మృతితో నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్
తారకరత్నకి నివాళులు అర్పించేందుకు రేపు ఉదయం హైదరాబాద్ బయలుదేరనున్న లోకేష్
సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాపం
'నటుడు నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి మోహనకృష్ణ గారికి, బాబాయి బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..' అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు.
'నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న.. చివరికి మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను..' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరుకున్నారు.
ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణ వార్త తనను చాలా కలచివేసిందన్నారు. 'ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం. చిన్న వయసులోనే సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. తారకరత్న కుటుంబానికి నా ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నా..' అని రేవంత్ రెడ్డి అన్నారు.
గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు..
తారకరత్న భౌతికకాయాన్ని రేపు ఉదయానికి మోకిలలోని తన నివాసానికి తరలిస్తారు.
ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు..
సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సోమవారం ఫిల్మ్ చాంబర్ కు తారకరత్న భౌతిక కాయం తీసుకురానున్నారు. అదేరోజు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నందమూరి తారకరత్న మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నందమూరి తారకరత్న అకాల మరణం ఎంతో బాధించిందన్నారుఉ. అత్యంత ప్రకాశవంతమైన, ప్రతిభావంతులైన, ఆప్యాయతగల యువకుడు అని కొనియాడారు. చాలా త్వరగా మనల్ని విడచి వెళ్లిపోయాడని అన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ సానుభూతి తెలిపారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
తారక రత్న మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు కుటుంబ సభ్యులు
ఆయన పార్ధివ దేహాన్ని హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ లో తరలింపుకు చర్యలు
బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నను చూసేందుకు వెళ్లిన గంటా శ్రీనివాస్ రావు
డాక్టర్లతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు : గంటా
తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది : గంటా
హైదరాబాద్ తరలించే విషయంపై చర్చలు జరుగుతున్నాయి : గంటా
తారకరత్నను ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర పరామర్శించారు
అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి
కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న వైద్యులు
రేపు మధ్యాహ్నం తరువాత హైదరాబాద్ తరలించే అవకాశం
ప్రపంచంలో మరే హీరోకి సాధ్యం కాని రికార్డు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. తారకరత్న గురించి ఈ విషయాలు తెలుసా?
నాలుగున్నరకే విడుదల కావాల్సి ఉన్నా హెల్త్ బులెటిన్ మరింత ఆలస్యం
మీడియాతో కుటుంబ సభ్యులు మాట్లాడే అవకాశం
అత్యంత తారకరత్న పరిస్థితి అత్యంత విషమం
ఈరోజు, రేపు గడవడం కష్టమని తారకరత్న అతి సన్నిహితుడి ఆఫ్ ది రికార్డ్ కామెంట్
వైద్యానికి తారకరత్న స్పందించడం లేదని తేల్చి చెప్పిన వైద్యులు?
మరి కొద్ది సేపట్లో తారకరత్న హెల్త్ బులిటెన్
కుప్పంలో యువగళం పాదయాత్రలో దాదాపు 45 నిమిషాల పాటు తారక రత్న గుండె ఆగిపోయిందని బాలకృష్ణ వెళ్లి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడని మృత్యుంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి సంబందించిన వివరాలు తెలుసుకోవాలంటే కింది లింక్ క్లిక్ చేయండి
'తారకరత్న' గుండెను మళ్లీ కొట్టుకునేలా చేసిన మహామృత్యుంజయ మంత్రం?
ఇక పొలిటికల్ గా కూడా యాక్టివ్ అవ్వాలని అనుకున్న నందమూరి తారకరత్న కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్‌ది నందమూరి రక్తం అంటూ యంగ్ టైగర్‌పై తారకరత్న చేసిన కామెంట్స్ అప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన చేసిన కామెంట్లు చదవాలంటే కింద హైలైట్ అయిన టెక్స్ట్ ను క్లిక్ చేయండి.
ఎన్టీఆర్‌ది నందమూరి రక్తం.. యంగ్ టైగర్‌పై తారకరత్న కామెంట్స్
తారకరత్నను బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాలో విలన్ గా తీసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం మీద పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింది లింక్ క్లిక్ చేయండి:
తారక రత్న పరిస్థితి విషమం
MRI స్కాన్‌లో బయటపడిన విషమ పరిస్థితి
బెంగుళూరు చేరిన కుటుంబసభ్యులు
విదేశీ వైద్యులు వచ్చినా తారకరత్న పరిస్థితి మెరుగుపడలేదని భావిస్తున్న నారాయణ హృదయాలయ వైద్యులు