Taraka Ratna With Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో తారక రత్నకు విబేధాలు ?

Taraka Ratna Relationships With Jr Ntr : నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో ఒకరికొకరి మధ్య ఉన్న సంబంధాలు మరోసారి చర్చనియాంశమయ్యాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే సినీ నేపథ్యం పరంగా చూసినా.. రాజకీయాల పరంగా చూసినా.. ప్రజా జీవితంలో నందమూరి కుటుంబానికి ఎంతో పేరుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 02:30 AM IST
Taraka Ratna With Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో తారక రత్నకు విబేధాలు ?

Taraka Ratna With Jr Ntr, Kalyan Ram : నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యం బారినపడిన నందమూరి తారక రత్న గత 23 రోజులుగా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర  విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని నెలల క్రితమే స్వర్గీయ నందమూరి తారక రామా రావు చిన్న కూతురు ఉమామహేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉమా మహేశ్వరి మృతి నుంచి నందమూరి కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడిలా నందమూరి తారక రత్న అకాల మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 

ఇదిలావుంటే, నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో ఒకరికొకరి మధ్య ఉన్న సంబంధాలు మరోసారి చర్చనియాంశమయ్యాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే సినీ నేపథ్యం పరంగా చూసినా.. రాజకీయాల పరంగా చూసినా.. ప్రజా జీవితంలో నందమూరి కుటుంబానికి ఎంతో పేరుంది. అయితే, ఏ ఇంట్లో చూసినా మట్టి పొయ్యే ఉంటుంది అన్న నానుడి చందంగా.. అంత పేరున్న నందమూరి వంశంలోనూ అంతర్గత విభేదాలు ఉన్నాయనేది నలుగురు బహిరంగంగానే చెప్పుకునే టాక్. ముఖ్యంగా తండ్రి నందమూరి తారక రామారావు చేతుల్లోంచి టీడీపీ చేజారిపోయి నారా చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని వ్యతిరేకించిన హరికృష్ణ కుటుంబంతో చంద్రబాబు వైపు ఉండే మద్దతుదారులు అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. 

నందమూరి తారక రామా రావు వారసుల్లో చంద్రబాబు నాయుడు వైపు నిలబడిన వాళ్లంతా హరికృష్ణ కుటుంబాన్ని దూరం పెట్టారని.. అలా హరికృష్ణ వారసులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తోనూ వారికి అంతంత మాత్రంగానే బంధాలు ఉన్నాయనేది ఒక టాక్. ఇదిలావుంటే.. అసలు తారక రత్నను సినిమాల్లో ప్రోత్సహించింది కూడా హరికృష్ణ వ్యతిరేక వర్గం అనే మరో టాక్ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ నందమూరి వారసుడు అనే ట్యాగ్ సొంతం చేసుకోకూడదు అనే దురుద్దేశంతోనే నందమూరి కుటుంబంలోనే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా తారక రత్నను ప్రోత్సహించారు అనేది అప్పట్లో వినిపించిన టాక్. 

ఇలాంటి ప్రచారాలు, పబ్లిక్ టాక్ మధ్య అసలు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నట్టుగానే తారక రత్న, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విబేధాలు ఉన్నాయా ? ఇద్దరూ కలుసుకుంటే ఒకరినొకరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఇత్యాది ప్రశ్నలకు ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక రత్న కుండబద్ధలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. తారక్‌కి, తనకు మధ్య విబేదాలు ఉన్నాయని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ.. తామంతా అన్నాదమ్ముళ్ల మాదిరిగానే అందరం సరదాగా కలిసి మెలిసి ఉంటాం అని సమాధానం ఇచ్చారు. బిజీ షెడ్యూల్ కారణంగా తరచుగా కలుసుకోలేకపోవచ్చునేమో కానీ.. కలిసిన ప్రతీసారి అందరు అన్నాదమ్ముళ్ల తరహాలోనే పలకరించుకుంటాం అని అన్నారు. అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో అయినా, తమ్ముడు తారక్‌తో అయినా తమ బంధం నార్మల్‌గానే ఉందని తెలిపారు. కొంతమంది చెప్పుకుంటున్నట్టుగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని తారక రత్న తన వ్యాఖ్యలతో పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

Trending News