Taraka Ratna: తారకరత్న విలన్‌గా నటించిన చిత్రాలు ఇవే.. ఆ సినిమాకు నంది అవార్డు

Taraka Ratna Filmography: నందమూరి తారకరత్న మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా తిరిగివస్తాడని అనుకుంటున్న తరుణంలో ఆయన మరణవార్తను జీర్ణించులేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తారకరత్నను నివాళులర్పిస్తున్నారు. తారకరత్న చిత్రాలను గుర్తు చేసుకుంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 12:25 AM IST
Taraka Ratna: తారకరత్న విలన్‌గా నటించిన చిత్రాలు ఇవే.. ఆ సినిమాకు నంది అవార్డు

Taraka Ratna Filmography: నందమూరి నట వారసుల్లో ఒకడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తారకరత్న.. సినీ చరిత్రలో ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డుతో ఎంట్రీ ఇచ్చాడు. ఒకే రోజు తొమ్మిది సినిమాలను ప్రకటించి సంచలన తెరంగేట్రం చేశాడు. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలయ్యాయి. ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో టాలీవుడ్ తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో పాటలు బాగున్నా.. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా.. ఒక్క హిట్ కూడా రాలేదు. దీంతో తారకరత్న ఎంత హైప్‌తో వచ్చాడో.. అంతే స్పీడ్‌గా గ్రాఫ్ పడిపోయింది. 

హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో విలన్‌గానూ ట్రై చేశాడు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ రోల్ పోషించాడు. ఇందులో తారకరత్న విలనిజానికి నంది అవార్డు కూడా వచ్చింది. మళ్లీ ఆయన హీరోగా ప్రయత్నించినా.. హిట్ మాత్రం దక్కలేదు. ఆ తరువాత నారా రోహిత్ హీరోగా నటించిన 'రాజా చెయ్యి వేస్తే' మూవీలోనూ తారకరత్న విలన్‌గా యాక్ట్ చేశాడు. 

ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ అవ్వకపోయినా.. తారకరత్న నటనకు మంచి పేరు వచ్చింది. 'దేవినేని' మూవీలో దేవినేని నెహ్రూ పాత్రలో మెప్పించాడు. చివరగా'ఎస్ 5' మూవీలో యాక్ట్ చేశాడు. మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన తారకరత్న చివరి సినిమా ఇదే. గతేడాది డిసెంబర్ 31న రిలీజ్ అయినా.. చాలా మందికి ఈ సినిమా గురించి తెలియదు. ఆ తరువాత ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు.

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రచన, సమర్పణలో వచ్చిన '9 అవర్స్' అనే వెబ్ సిరీస్‌లో పోలీస్ క్యారెక్టర్ పోషించారు. సీఐ ప్రతాప్ పాత్రలో తారకరత్న ప్రేక్షకులను అలరించారు. ఆయన ఎప్పుడో పూర్తి చేసిన సినిమాలు.. త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మిస్టర్ తారక్ సినిమాను ఈ నెల 24న బాక్సాఫీసు ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ ఓటీటీలో రిలీజ్ అయింది.

Also Read: Taraka Ratna Death: శివరాత్రి నాడే తారకరత్న కన్నుమూత.. తీవ్ర విషాదంలో నందమూరి కుటుంబం

Also Read: Nandamuri Taraka Ratna: బాలయ్య రిప్లేస్‌ కోసమే తారకరత్న తెరపైకి..? చివరి కోరిక నెరవేరకుండానే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News