Lyric writer chandra bose gives a clue on samantha special song in pushpa movie: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ కాంబోలో వస్తోన్న మూవీ పుష్ప. ఈ మూవీని రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు సుక్కు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్.. పుష్ప ది రైజ్‌ (Pushpa The Rise) డిసెంబర్‌ 17న రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పుష్ప మూవీ (Pushpa Movie) నుంచి రిలీజైన పాటలకు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది.అయితే ఇందులోని కొన్ని పాటలకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. చిత్తూరు జిల్లా యాసలో చంద్రబోస్ కొన్ని పాటలు రాశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, చంద్రబోస్ కాంబోలో(Devisree Prasad, Chandrabose Combo) గతంలో వచ్చిన మూవీల్లో ఐటెమ్‌ సాంగ్స్ అదిరిపోయాయి. అలాగే పుష్ప మూవీలో కూడా ఒక అదిరిపోయే ఐటెమ్‌ సాంగ్ ఈ కాంబోలో రానుంది. గతంలో రంగస్థలం మూవీలో కూడా ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ఐటెమ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 


ఆర్య సినిమా నుంచి సుకుమార్‌తో (Sukumar‌) చంద్రబోస్‌కు మంచి అనుబంధం ఉంది. ఇక సుకుమార్‌ ఒక పెద్ద సాహిత్య గని అంటూ చంద్రబోస్ తాజాగా వెల్లడించారు. సుకుమార్‌‌ను సంతృప్తి పరచడం అంత ఈజీ కాదన్నారు. తాను ఆయన అంచనాలకు తగ్గట్లుగా పాటలు రాస్తూ మెప్పిస్తుంటాను అన్నారు. 


పుష్ప మూవీలో.. పుష్పరాజ్ గమ్యాన్ని.. జీవితాన్ని.. అతని కోణంలో చూపిస్తూ పాటలు రాశానని చెప్పుకొచ్చాడు చంద్రబోస్. దాక్కో దాక్కో మేక అనే పాట అలా రాసిందేనట. అలాగే శ్రీవల్లి పాటను పలుకే బంగారమాయనే కీర్తన స్ఫూర్తితో రాశాడట. ఇక సామీ.. సామీ పాటను (Sami .. Sami song) పూర్తిగా చిత్తూరు యాసలో రాశారు. చిత్తూరు స్లాంగ్‌ను, అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన నేటివిటీ పదాల కోసం చాలా అన్వేషించాడట చంద్రబాస్.



Also Read : Vicky Katrina Marriage Photos: విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ పెళ్లి ఫొటోలు వైరల్..


అయితే సుకుమార్ మూవీలో ఐటెం సాంగ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇక ఈ మూవీలో ఐటెమ్‌ సాంగ్‌లో (Item Song) సమంత తళుక్కమననుంది. దీంతో పుష్ప మూవీ ఐటెమ్ సాంగ్‌పై అంచనాలు పెరిగాయి. సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్ కాంబోలో గతంలో వచ్చిన మూవీల్లో మాదిరిగానే ఈ మూవీలో కూడా ఐటెమ్ సాంగ్ ఎంతో బాగుంటుందని చంద్రబోస్ పేర్కొన్నారు. పుష్ప మూవీలో ఊ అంటావా ఉహూ అంటావా (OoAntavaOoOoAntava) అని తాను రాసిన స్పెషల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ కానున్నట్లు చెప్పుకొచ్చారు చంద్రబోస్.


 


సమాజంలోని ఓ అంశాన్ని ఎలివేట్ చేస్తూ ఈ పాట రాశానన్నాడు చంద్రబోస్. ఇక ఈ పాటకు సమంత అందం, డ్యాన్స్ కూడా చక్కగా అదిరిపోయాయట. సుకుమార్‌, చంద్రబోస్ కాంబోలో గతంలో వచ్చిన జిగేల్ రాణి పాట.. డియ్యాలో డియ్యాలో సాంగ్.. రింగ రింగ పాట మాదిరిగానే ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ వస్తుందట. 


Also Read : RRR trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసి ఆలియా భట్ ఫ్యాన్స్ ఫైర్.. అసలు సమస్య ఏంటో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook